Actor Subbaraju: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు, భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన టాలీవుడ్ నటుడు
ప్రముఖ సినీ నటుడు సుబ్బరాజు ఒక ఇంటివాడయ్యాడు. 47 ఏళ్ల లేటు వయస్సులో వివాహం చేసుకున్నారు సుబ్బరాజు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. పెళ్లి గురించిన ఆలోచన లేదని చెబుతూ వచ్చిన సుబ్బరాజు సడన్ సర్‌ప్రైజ్‌గా తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పెళ్లికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.
Hyd, Nov 27: ప్రముఖ సినీ నటుడు సుబ్బరాజు ఒక ఇంటివాడయ్యాడు. 47 ఏళ్ల లేటు వయస్సులో వివాహం చేసుకున్నారు సుబ్బరాజు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. పెళ్లి గురించిన ఆలోచన లేదని చెబుతూ వచ్చిన సుబ్బరాజు సడన్ సర్‌ప్రైజ్‌గా తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పెళ్లికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.
అయితే తన భార్య గురించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ విలన్‌గా, కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు సుబ్బరాజు. ఖడ్గం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. సుబ్బరాజు స్వస్థలం భీమవరం. జైనబ్ రావడ్జీతో అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్..అధికారికంగా ప్రకటించిన నాగార్జున
Here's Instagram Post:
View this post on Instagram
ఖడ్గం సినిమా తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఆర్య, పోకిరి, లీడర్, బిజినెస్ మ్యాన్, బాహుబలి 2 వంటి హిట్ చిత్రాల్లో తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నారు.
(The above story first appeared on LatestLY on Nov 27, 2024 08:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

