Unstoppable-2: బాలయ్యతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్..?? 'అన్ స్టాపబుల్ 2' వేదికగా చర్చ.. ఏంటా విషయం??
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా ఆహా (Aha) ఓటీటీలో (OTT) ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ (Unstoppable). ఇప్పుడీ షో రెండో సీజన్ నడుస్తోంది.
Hyderabad, Feb 10: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా ఆహా (Aha) ఓటీటీలో (OTT) ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ (Unstoppable). ఇప్పుడీ షో రెండో సీజన్ నడుస్తోంది. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో రూపొందించిన ఇంటర్వ్యూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటీటీ రికార్డులను (OTT Records) తిరగరాసింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ రెండో పార్ట్ కూడా వచ్చేస్తోంది. 'అన్ స్టాపబుల్ 2' టాక్ షోలో పవన్ కల్యాణ్ పాల్గొన్న సెకండ్ ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయింది.
బాలయ్య ప్రశ్నలు .. అందుకు సమాధానంగా పలకపై పవన్ 'ఎస్ - నో' అని రాసి చూపించే రౌండ్ ఎపిసోడ్లో సరదాగా నడిచింది. తనతో మల్టీ స్టారర్ చేయాలని ఉందా? అనే బాలయ్య ప్రశ్నకి, పవన్ 'ఎస్' అంటూ పలకపై రాసి చూపించడంతో ఆడిటోరియం అంతా సందడిగా మారిపోయింది.
(The above story first appeared on LatestLY on Feb 10, 2023 10:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

