VD12 : విజయ్ దేవరకొండ VD12 రిలీజ్ డేట్ ఫిక్స్, టైటిల్ - ఫస్ట్ లుక్ కూడా ఎప్పుడో చెప్పేసిన మేకర్స్, ఆసక్తికరంగా రౌడీ బాయ్ లుక్
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం VD12. సినిమా షూటింగ్ జరుగుతుండగా ఇవాళ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.
Aug 2: ఈ ఆగస్టు నెలలోనే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగగా ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయింది.
పాన్ ఇండియా లెవల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ ఆగస్టులో టైటిల్, ఫస్ట్ లుక్‌ను అనౌన్స్ చేస్తామని వెల్లడించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ప్రముఖ ఛాయగ్రాహకులు గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం, నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూత, నా బెస్ట్ ఫ్రెండ్ ఇకలేరంటూ మంచు మనోజ్ ట్వీట్
Here's Tweet:
His Destiny awaits him.
Mistakes.
Bloodshed.
Questions.
Rebirth.
28 March, 2025.#VD12 pic.twitter.com/z2k0qKDXTC
— Vijay Deverakonda (@TheDeverakonda) August 2, 2024
(The above story first appeared on LatestLY on Aug 02, 2024 05:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

