Antony Thattil: ఎవరీ ఆంటోనీ తట్టిల్?, కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి నెటిజన్ల సెర్చ్, వీరిద్దరి పరిచయం ఎక్కడ జరిగిందో తెలుసా!
ఇండస్ట్రీలో మరో హీరోయిన్ పెళ్లికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సౌత్ స్టార్ హీరోయిన్ మహానటి 'కీర్తి సురేష్' త్వరలో పెళ్లి చేసుకోనుంది. తన చిననాటి స్నేహితుడు ఆంటోని తటిల్‌ని పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ చిననాటి స్నేహితుడే ఆంటోనీ. వీరిద్దరూ హైస్కూల్‌లో క్లాస్ మేట్స్.
Hyd, Nov 20: ఇండస్ట్రీలో మరో హీరోయిన్ పెళ్లికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సౌత్ స్టార్ హీరోయిన్ మహానటి 'కీర్తి సురేష్' త్వరలో పెళ్లి చేసుకోనుంది. తన చిననాటి స్నేహితుడు ఆంటోని తటిల్‌ని పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ చిననాటి స్నేహితుడే ఆంటోనీ. వీరిద్దరూ హైస్కూల్‌లో క్లాస్ మేట్స్.
వీరిద్దరి మధ్య చాలా కాలం నుండే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు తెలిసింది. గోవాలో డిసెంబర్ 11 లేదా 12న పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు ఎవరీ ఆంటోని తటిల్ అని వెతకడం ప్రారంభించారు. కొచ్చికి చెందిన ఆంటోనీ తటిల్ దుబాయ్‌లో పెద్ద వ్యాపారవేత్త. కైపలాత్ హబీబ్ ఫరూక్‌తో కలిసి చెన్నైలో నమోదైన ఆస్పెరోస్ విండో సొల్యూషన్స్‌కు యజమాని కూడా. త్వరలోనే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
వాస్తవానికి కీర్తి సురేష్ గతంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో, కీర్తి సురేష్ తండ్రి మరియు నిర్మాత జి సురేష్ కుమార్ ఈ పుకార్లను తీవ్రంగా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తాజాగా కీర్తి సురేష్ వివాహానికి సంబంధించిన వార్తే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిననాటి స్నేహితుడితో కీర్తి సురేష్ వివాహం, గోవాలో పెళ్లి...మ్యారేజ్ డేట్ ఫిక్స్!
నటి మేనక, నిర్మాత జి. సురేష్ కుమార్ కుమార్తె కీర్తి సురేశ్. మలయాళంలో బాలనటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అగ్ర హీరోయిన్‌గా రాణిస్తోంది. గీతాంజలి చిత్రంతో SIIMA ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. తెలుగులో ఆమె నటించిన మహానటి సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కింది. బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది కీర్తి సురేష్. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.
(The above story first appeared on LatestLY on Nov 20, 2024 02:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

