World Famous Lover: నలుగురు అమ్మాయిలతో రొమాన్స్, విజయ్ దేవరకొండ అయిపోతున్నాడు 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ కొత్త సినిమా విశేషాలు, స్టోరీలైన్ ఎలా ఉండొచ్చో ఇక్కడ తెలుసుకోండి
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ సినిమాలో "ఫైటర్" అనే యాక్షన్ సినిమాలో నటించాల్సి ఉంది. ఈలోపు పూరి కూడా తన కొడుకు ఆకాశ్ పూరితో ఒక రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు...
ఇప్పటివరకు ఇండియాలోనే ఒక పాపులర్ యాక్టర్‌గా పేరుతెచ్చుకున్న రౌడీ స్టార్ - విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇప్పుడు 'ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు' కాబోతున్నాడు. 'డియర్ కామ్రెడ్' సినిమా తర్వాత విజయ్ తన కొత్త సినిమా ప్రాజెక్ట్ వివరాలను అనౌన్స్ చేశాడు. ఈ కొత్త సినిమా పేరు "వరల్డ్ ఫేమస్ లవర్" (World Famous Lover). ఈ సినిమాలో విజయ్ పక్కన నలుగురు హీరోయిన్లు రాశి ఖన్నా (Raashi Khanna), ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కేథరీన్ ట్రెసా (Catherine Tresa) మరియు ఇజబెల్లె లీటీ (Isabelle Leite) నటిస్తున్నారు.
గతంలో "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" సినిమాను తెరకెక్కించిన దర్శకుడు క్రాంతి మాధవ్ మరియు ఆ చిత్ర నిర్మాత కె.ఎ.వల్లభ మళ్ళీ ఒకసారి జతకూడి ఈ 'వరల్డ్ ఫేమస్ లవర్'కు దర్శక, నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'గీతా గోవిందం' సినిమా కోసం విజయ్‌తో కలిసి పనిచేసిన గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం కంపోజ్ చేయబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాదులో ప్రారంభమైంది. కొన్ని రోజుల కిందటే స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ పర్యవేక్షణలో ఒక ఛేసింగ్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాతో ఐశ్వర్య రాజేశ్ మరియు ఇజబెల్లె లీటీ టాలీవుడ్‌కి ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. ఐశ్వర్య రాజేశ్‌కి ఇప్పటికే తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే రిలీజైన తమిళ డబ్బింగ్ మూవీ "కౌసల్య కృష్ణమూర్తి" సినిమా చూసిన ప్రేక్షకులకు ఐశ్వర్య రాజేశ్ పరిచయమే. మరో హీరోయిన్ బ్రెజిల్‌కు చెందిన యాక్టర్, మోడెల్ అయిన ఇజబెల్లె లీటీ చాలావరకు ఇండియాలోని బ్యూటీ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన యాడ్స్‌లలో కనిపిస్తుంది. 'Sixteen' అనే బాలీవుడ్ మూవీలో కూడా నటించింది.
ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్లో 9వ చిత్రం. ఇన్నిరోజులు 'VD9' పేరుతో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు "World Famous Lover" గా టైటిల్ ఫైనల్ చేశారు. ఇదే విషయాన్ని హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
Vijay Devarakonda's Tweet:
వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్‌లుక్ సెప్టెంబర్ 20న, ఈ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. అయితే ఈ సినిమా టైటిల్ తెలిపారు కానీ, ఈ సినిమా స్టోరీలైన్ ఏంటి? ఎలా ఉండబోతుంది అనే విషయాలపై సినిమా యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా టైటిల్, నలుగురు హీరోయిన్స్ ఉండటంను బట్టి చూస్తే, ఇది పక్కా రొమాంటిక్ సినిమా అని అర్థమవుతుంది. అలాగే విజయ్ దేవరకొండ లవర్ బాయ్, ప్లే బాయ్ రోల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఫస్ట్‌లుక్ టీజర్ రిలీజైన తర్వాత ఏమైనా తెలిసే ఛాన్స్ ఉండొచ్చు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ సినిమాలో "ఫైటర్" అనే యాక్షన్ సినిమాలో నటించాల్సి ఉంది. ఈలోపు పూరి కూడా తన కొడుకు ఆకాశ్ పూరితో ఒక రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 17, 2019 12:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

