Tollywood Trends: 'సైరా'లో నాకు అవకాశం రావడం నా అదృష్టం - విజయ్ సేతుపతి. విభిన్న సినీ పరిశ్రమలకు చెందిన నటులను నటింపజేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న తెలుగు సినిమా!

Tollywood Trends:  'సైరా'లో నాకు అవకాశం రావడం నా అదృష్టం - విజయ్ సేతుపతి. విభిన్న సినీ పరిశ్రమలకు చెందిన నటులను నటింపజేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న తెలుగు సినిమా!

ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి నటులు తెలుగు సినిమాలో పనిచేయాలనుకోవడం చాలా అరుదు. కానీ ఇప్పుడు చాలా మoది తమిళ నటులు తెలుగులో అరంగేట్రానికి తహతహ లాడుతున్నట్లు కనిపిస్తోంది!

చిన్న మరియు గుర్తింపు లేని పాత్రలు పోషించడం నుండి జాతీయ అవార్డును గెలుచుకోవడం వరకు వెళ్లిన తమిళ నటుడు విజయ్ సేతుపతి కెరీర్ లో చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన తన మార్కెట్ పరిధిని పెoచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

41 ఏళ్ల ఈ నటుడు, ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు, "తెలుగు సినిమా కోసం పనిచేయాలనే తన కల సైరా తొ నెరవేరిందని, తను జాతీయ అవార్డు గెలుచుకోవడం చాలా ఆనందానిచ్చిందని చెప్పాడు".

"నేను తెలుగు చిత్ర సీమ లో పని కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని. కొన్నేళ్ల క్రితం రవితేజ తో కలిసి అవకాశాలు అడిగానని, అతని చిత్రాలలో విలన్ గా నటిస్తానని చెప్పాను కూడా. కానీ నాకు  జై లవ కుసాలో దర్శకుడు బాబీమంచి విలన్ పాత్రను ఇచ్చాడు, అప్పుడు నేను నా తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉండడం వలన కుదరలేదు. కానీ ఇప్పుడు పని చెయ్యాలని చాలా ఆశగా ఎదురుచూస్తున్న నాకు సైరా తొ మంచి అవకాశం వచ్చిందని" చెప్పాడు.

"తనకి ఎప్పుడూ తెలుగు సినిమాలన్నా, ఇక్కడి పరిశ్రమలో పనిచేసే విధానం అన్నా చాలా ఇష్టం అని అలాగే, ఈమధ్య ఇక్కడ క్రొత్తధనాన్ని, కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యడం ఖచ్చితంగా మంచి ఆలోచన అని ముఖ్యంగా మీరు నటుడిగా ఉన్నప్పుడు, క్రొత్త విషయాలను అన్వేషించడం తప్పనిసరి" అని ఈ సందర్బంగా విజయ్ సేతుపతి తెలిపారు.

అలాగే తనకు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, సుదీప్, జగపతి బాబు మరియు భారతీయ సినిమాలోని అనేక మంది అద్భుతమైన నటి నటులతో కలిసి ఒకే చిత్రంలో పనిచెయ్యడం చాలా ఆనందంగా ఉందని. నేను తెలుగులో వేరే మంచి ప్రాజెక్ట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయిoదని. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్లో తనకు అవకాశాం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని" ఆయన అన్నారు.

అక్టోబర్ 2 న ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నానని అయన తెలిపారు.

(The above story first appeared on LatestLY on Sep 12, 2019 02:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).