Jabardasth: జబర్దస్త్ జడ్జి మనో సీరియస్, ఎమ్మెల్యే రోజా చెప్పినా వినకుండా..కమెడియన్‌పై దూసుకెళ్లిన మనో, ఏం జరిగిందంటే..?

రాకింగ్ రాకేష్ స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మనో ఇలా అంటాడు.. ‘ఎంత గౌరవం అయ్యా నువ్వంటే రాకేష్ నాకు.. ఏంటిది.. పద్దతేనా అస్సలు.. ఏ స్టేజీ.. మీరు చేస్తున్నది ఏంటి అంటూ అతడిపై విరుచుకుపడతాడు.

Jabardasth: జబర్దస్త్ జడ్జి మనో సీరియస్, ఎమ్మెల్యే రోజా చెప్పినా వినకుండా..కమెడియన్‌పై దూసుకెళ్లిన మనో, ఏం జరిగిందంటే..?
Image Credit: Youtube

జబర్దస్త్ తెలుగు బుల్లితెరపై టాప్ కామెడీ షో.  పలు చానెల్స్ లో ఇప్పటి వరకు ఈ షోను బీట్ చేసే షో రాలేదు అంటే.. జబర్దస్త్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.  జబర్దస్త్ లో ఎక్కువగా గుర్తుకు వచ్చేది సుడిగాలి సుధీర్, రష్మీ కెమిస్ట్రీ. ఈ జంటకు ఆన్ స్క్రీన్ మీద బాగానే క్రేజ్ ఉంది. అయితే ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా ఓ ప్రోమో విడుదల అయింది. ఇది నవంబర్ 5 న టెలికాస్ట్ కానుంది. దీనిలో ప్రతీ ఒక్కరూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. ఈ ప్రోమోలో వర్షను భాస్కర్ ట్రై చేశాడని కామెడీగా చెబుతుంది వర్ష. సుడిగాలి సుధీర్ స్కిట్ లో మర్చిపోయి అమ్మాయి ప్యాంట్ వేసుకొని వచ్చాడని.. సుధీర్ ను జడ్జి రోజా నవ్వుతూ కామెంట్ చేస్తుంది. తర్వాత ఇమాన్యూయల్, వర్ష మళ్లీ తన జోడీ కామెడీని పండించారు. ఫైమా మాత్రం మళ్లీ యాచకురాలి వేషంలో భాస్కర్ టీంలో కనపడుతుంది.

ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మనో ఇలా అంటాడు.. ‘ఎంత గౌరవం అయ్యా నువ్వంటే రాకేష్ నాకు.. ఏంటిది.. పద్దతేనా అస్సలు.. ఏ స్టేజీ.. మీరు చేస్తున్నది ఏంటి అంటూ అతడిపై విరుచుకుపడతాడు. ఐ యామ్ సో సారీ అంటూ అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు మనో.

మనో గారు అంటూ రోజా అంటున్నా.. అతడు వినకుండా ఆ చైర్ పై నుంచి దిగి వెళ్లిపోతాడు. మనో వెళ్లకుండా అడ్డుకున్న రాకేష్ టీం సభ్యులను.. పైకి వెళ్లండి అంటూ కోపంతో చెబుతాడు మనో. ఐ యామ్ స్వారీ సార్ అంటూ రాకేష్ అంటున్నా.. చేయితో కొట్టబోతాడు మనో. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

సారీ మేడం అంటూ రోజాతో చెప్పి.. అక్కడ నుంచి బయటకు వెళ్లిపోతాడు సింగర్ మనో. అయితే ఇది కేవలం ప్రోమో కోసం చేసినట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే.. నవంబర్ 5 న ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

(The above story first appeared on LatestLY on Nov 02, 2021 02:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).