Latest Film News Updates: లేటెస్ట్ ఫిలిం న్యూస్ అప్డేట్స్

Latest Film News Updates: లేటెస్ట్ ఫిలిం న్యూస్ అప్డేట్స్

  • కెజిఫ్ కన్నడ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ని కలవడం సినిమా ప్రేమికుల్లో ఆసక్తిని రేపుతోంది.
  • అర్జున్ రెడ్డి సెన్సేషన్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో నిర్మాతగా సినిమా మొదలు పెట్టనున్నారని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినపడుతున్నాయి. 
  • రజనీకాంత్ నటించిన 2.0 చైనా బాక్సాఫీస్ కలెక్షన్ రూ  17.68 కోట్లు తో,  బాహుబలి 1 వ వారాంతపు రికార్డు రూ .5.15 కోట్లు ను బద్దలు కొట్టింది.
  • ప్రభాస్ నటించిన 'సాహో',  రజనీకాంత్ 'ఎందిరన్', 'కబాలి' చిత్రాల వసూళ్ళని ఓడించి, బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు చేసిన దక్షిణ భారత చిత్రంగా 4 వ స్థానంలో నిలిచింది (మొదటి మూడు స్థానాల్లో బాహుబలి 2, 2.o మరియు బాహుబలి 1 చిత్రాలు ఉన్నాయి  ).
  • యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన "మారి - 2" తమిళ చిత్రంలోని "రౌడీ బేబీ" పాట యూట్యూబ్‌లో 600 మిలియన్ల వీక్షణలను దాటిన మొదటి దక్షిణ భారత పాటగా నిలిచింది.
  • మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రం “పొన్నీయన్  సెల్వన్‌” కోసం రంగంలోకి దిగిన ఆర్ట్ డైరక్టర్ తోట తరణి. 
  • ఈసారి క్రైం థ్రిల్లర్ తొ వస్తున్న రామ్ పోతినేని మరియు కిశోర్ తిరుమల (ఇది తమిళ్ చిత్రం "టడంకి" రీమేక్).
  • హాలీవుడ్ దర్శకుడు టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించిన 'జోకర్' వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుపొందింది, ఇందులో రుజోక్విన్ ఫీనిక్స్ జోకర్ గా నటించారు.

(The above story first appeared on LatestLY on Sep 10, 2019 12:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).