New Telugu Movie Trailers: గోపీచంద్ 'చాణక్య' , వరుణ్ తేజ్ 'వాల్మీకి'

గోపీచంద్ చాణక్య  ట్రైలర్ : 

గోపిచంద్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చాణక్య’,  తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం టీజర్ నిన్న రిలీజ్ చెయ్యడం జరిగింది. ఈ సినిమా యాక్షన్ స్పై థ్రిల్లర్‌ అని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.

విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతుండగా, వెట్రీ సినిమాటోగ్రఫీని నిర్వహించారు.

అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ క్రింద ‘చాణక్య’ ను దసరా పండుగకు విడుదల చెయ్యడానికి సిద్ధం చేస్తున్నారు.

వరుణ్వా తేజ్ వాల్మీకి  ట్రైలర్ :-

2014 తమిళ చిత్రం జిగర్తాండాకు ఇది రీమేక్. ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడు ఇది ఆక్షన్ కామెడీ జోనర్ అని, తెలుగు రీమేక్‌లో వరుణ్ పాత్ర బాగా ఎలివేట్ అయిందని, మాస్ ని మెప్పిస్తుందని చెప్పారు.

ఈ చిత్రం, 14 రీల్స్ బ్యానర్‌ ఫై రామ్ అచంట మరియు గోపిచంద్ అచంట లు నిర్మించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.