This Week Movies- OTT Releases: నేడే చూడండి..! ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

This Week Movies- OTT Releases: నేడే చూడండి..! ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!
This Week Movies- OTT Releases | Pixabay/file

This Week Movies- OTT Releases: ప్రతీవారం లాగే ఈవారం కూడా మరిన్ని కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించనున్నాయి. ఫిబ్రవరి 23, 2024న థియేటర్లలో విడుదలైన సినిమాలు, క్లుప్తంగా వాటి రివ్యూలు, అలాగే ఈరోజు నుంచి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు, రాబోయే చిత్రాల విశేషాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.

ఈ వారం థియేటర్లలో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో పెద్ద సినిమాలు ఏవీ లేవు. చాలా వరకు పరిచయం లేని హీరోల సినిమాలు, మిగిలిపోయిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాబట్టి వాటిని థియేటర్లకు వెళ్లి చూడాలా? ఓటీటీ రిలీజ్ వరకు ఆగాలా అన్నది మీ ఇష్టం. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో పోటాపోటీగా సినిమాలు వస్తున్నాయి. ఈవారం రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన వ్యూహం, శపథం వంటి సినిమాలు విడుదల కావాల్సింది కానీ మరోసారి వాయిదాపడ్డాయి. ఈ వారం ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో తమ సినిమాలను మార్చి మొదటి వారానికి వాయిదా వేసినట్లు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

ఈవారం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు

మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా (తెలుగు): అభినవ్ గోమతం, వైశాలి, తరుణ్ భాస్కర్ తదితరులు నటించిన రొమాంటిక్ డ్రామా

సుందరం మాస్టర్ (తెలుగు): వైవా హర్ష, దివ్య శ్రీపాద తదితరులు నటించిన రొమాంటిక్ డ్రామా

ఆర్టికల్ 370 (హిందీ) యామీ గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ డ్రామా

క్రాక్ - జీతేగా తో జియేగా(హిందీ) విద్యుత్ జమ్వాల్, నోరా ఫతేహి, అర్జున్ రాంపాల్, అమీ జాక్సన్ తదితరులు నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ

డెమన్ స్లేయర్ (జపనీస్, ఇంగ్లీష్) యానిమేషన్ మూవీ

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి (తెలుగు): ప్రియదర్శి, శ్రీంద తదితరులు నటించిన క్రైమ్ థ్రిల్లర్

సిద్ధార్థ్ రాయ్ (తెలుగు) దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని యల్లారెడ్డి తదితరులు నటించిన రొమాంటిక్- థ్రిల్లర్ మూవీ

ముఖ్యగమనిక (తెలుగు) విరన్ ముత్తంశెట్టి, లావణ్య సాహుకార, ఆర్యన్ ఇప్పిలి తదితరులు నటించిన క్రైమ్ థ్రిల్లర్

వీటితో పాటు మరికొన్ని సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకువచ్చాయి.

ఈవారం ఓటీటీలో రిలీజ్ అవుతున్నవి

ఈవారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, త్వరలో రాబోయే సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి..

స్టార్ వార్స్: బ్యాడ్ బ్యాచ్ S3-- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది.

అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్-- స్ట్రీమింగ్ - నెట్‌ఫ్లిక్స్

ఆంటోని: స్ట్రీమింగ్ - ఆహా

రెజీనా (తెలుగు)- స్ట్రీమింగ్- అమెజాన్ ప్రైమ్

పోచర్ (మలయాళ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 23- అమెజాన్ ప్రైమ్

మలైకోట్టై వాలిబన్ (మలయాళ డబ్బింగ్) – డిస్నీ+ హాట్‌స్టార్

ఇంద్రాణి ముఖర్జీ కథ: బరీడ్ ట్రూత్ (హిందీ డాక్యుమెంట్-సిరీస్-- స్ట్రీమింగ్ - నెట్‌ఫ్లిక్స్

ప్రస్తుతం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ టాక్ తెచ్చుకుంటేనే, అవి అక్కడ మనుగడ సాగిస్తాయి. ఈ జాబితాలో 'హనుమాన్' మూవీ ఒక్కటే నిలిచింది. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఇప్పుడు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 ఫిల్మ్ దక్కించుకుంది. మార్చి 02 లేదా 06, 2024 నుంచి స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.

(The above story first appeared on LatestLY on Feb 23, 2024 10:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).