Anchor Rashmi Strong Warning to Sudheer: సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ, హద్దుల్లో ఉండాలని తేల్చిచెప్పేసింది, అందరూ చూస్తుండగానే..

ఇటీవలే జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి రష్మి గౌతమ్, సుడిగాలి సుదీర్ తప్పుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆ వార్తలకు తగ్గట్టుగా జబర్దస్త్ తో పాటుగా ఇతర టీవీ చానల్స్ లో కూడా వీరిద్దరూ కనిపించలేదు. దీంతో వీరిద్దరి అభిమానులు రష్మీ, సుధీర్ ఎక్కడ అంటూ కామెంట్స్ చేశారు.

Anchor Rashmi Strong Warning to Sudheer: సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ, హద్దుల్లో ఉండాలని తేల్చిచెప్పేసింది, అందరూ చూస్తుండగానే..
Anchor Rashmi, Sudheer (Image: Twitter)

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుదీర్,రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరికి యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక వీరిద్దరూ రియల్ లైఫ్ లో కలిసిపోతే చూడాలి అనుకునే వారు చాలామంది ఉన్నారు.ఇక జబర్దస్త్ షోలో, అలాగే డీ షోలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీనీ ఇప్పటికి ఎన్నో సార్లు చూసాం. ఈ జోడిని స్టేజ్ పై ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు.వీరిద్దరిపై బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో రకాల ఈవెంట్లను చేశారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఒక ప్రోగ్రాం లో రష్మి, సుడిగాలి సుదీర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. నేను లేనప్పుడు చేసింది చాలు. నీ హద్దుల్లో మర్యాదగా ఉండు అంటూ రష్మీ, సుధీర్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది.అసలేం జరిగిందంటే. ఇటీవలే జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి రష్మి గౌతమ్, సుడిగాలి సుదీర్ తప్పుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆ వార్తలకు తగ్గట్టుగా జబర్దస్త్ తో పాటుగా ఇతర టీవీ చానల్స్ లో కూడా వీరిద్దరూ కనిపించలేదు. దీంతో వీరిద్దరి అభిమానులు రష్మీ, సుధీర్ ఎక్కడ అంటూ కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ అయితే అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సుధీర్, రష్మీ వారికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తమ రెమ్యునరేషన్ పెంచాలని గట్టిగా కోరడంతో, జబర్దస్త్ షో నిర్వాహకులు వారిని పక్కన పెట్టారు అంటూ గట్టిగా వార్తలు వినిపించాయి.అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.మళ్లీ రష్మీ, సుధీర్ జబర్దస్త్ స్టేజీపై ఎంట్రీ ఇచ్చారు.వచ్చీ రాగానే ఎక్సట్రా జబర్దస్త్ లో వీరి హంగామా చూపిస్తూ.జల జల జలపాతం నువ్వు నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి అనే పాట లకు ఇద్దరు స్టెప్పులు ఇరగదీశారు.వారిద్దరి మధ్య సరదాగా సంభాషణ జరగగా. అప్పుడు రష్మీ సుధీర్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.ఇక రష్మి సుదీర్ మళ్లీ జంటగా స్టేజ్ పై కనిపించడంతో వీరిద్దరి అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇంకొందరు అయితే వీరిద్దరిని మళ్ళీ ఢీ షోకి తీసుకురావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jan 06, 2022 09:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).