Big Boss 4 Telugu Winner: బిగ్ బాస్ 4 విజేత అభిజిత్, గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వీచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, విజేతకు సీజన్ 4 ట్రోఫి మరియు రూ. 25 లక్షల క్యాష్ రివార్డ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేతగా యంగ్ హీరో అభిజిత్ నిలిచారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వందరోజులకు పైగా టీవీ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ రియాలిటీ షో, ఆదివారం ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వీచ్చేశారు....
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేతగా యంగ్ హీరో అభిజిత్ నిలిచారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వందరోజులకు పైగా టీవీ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ రియాలిటీ షో, ఆదివారం ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వీచ్చేశారు. గ్రాండ్ ఫినాలే సినీతారల సందడితో పాటు విజేత ఎవరు నిలుస్తారు అనే దానిపై చివరి వరకు ఉత్కంఠగా సాగింది. అయితే ఈ సీజన్ లో ఎంతో పరిణితి చూపుతూ చాలా పకడ్బందీగా, తెలివిగా ఆడిన అభిజితే అందరి అంచనాలకు తగినట్లుగా విజేత అయ్యాడు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో అభిజిత్ ప్రత్యర్థి అయిన అఖిల్ రన్నరప్ గా నిలిచాడు.
ఇదిలా ఉంటే, సీజన్ 4 గ్రాండ్ ఫినాలేలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. టాప్ 5 నుంచి మొదటగా హారిక, ఆ తర్వాత అరియానా వెనుదిరగగా టాప్ 3 లో అభిజిత్, అఖిల్ మరియు సోహైల్ నిలిచారు. దీంతో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ ఎవరైతే తమకు తాముగా బిగ్ బాస్ పోటీ నుంచి తప్పుకుంటారో వారికి రూ. 20 లక్షల రివార్డ్ ప్రకటించారు. అయితే ముగ్గురి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నాగార్జున రివార్డును మరో రూ. 5 లక్షలు పెంచి రూ. 25 లక్షలు చేశారు. దీంతో సోహైల్ ముందుకొచ్చి ఆ రూ.25 లక్షలు తీసుకుని పోటీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఆ రూ. 25 లక్షలు, విజేతకు లభించే దానిలో కోత పెట్టి ఇస్తామని చెప్పడం కొసమెరుపు. దీంతో ఈ సీజన్ విజేతగా నిలిచిన అభిజిత్ ప్రైజ్ మని రూ. 25 లక్షలు మాత్రమే.
సీజన్ 4లో సూర్య కిరణ్, మోనాల్ గజ్జర్, అభిజిత్, లాస్యా మంజునాథ్, సుజాత, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్, అలేఖ్య హరిక, దేవి నాగవల్లి, మెహబూబ్ షేక్, అమ్మ రాజశేఖర్, దివి వైద్య, అఖిల్ సార్థక్ మరియు గంగవ్వ పోటీదారులుగా నిలిచారు.
(The above story first appeared on LatestLY on Dec 21, 2020 09:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

