Hyper Aadi-Manchu Vishnu: మంచు విష్ణును ఘోరంగా అవమానించిన హైపర్ ఆది, అందరూ చూస్తుండగానే అంత మాట అనేసాడుగా..

ఈటీవీలో దివాళీ స్పెషల్ ఈవెంట్ వస్తుంది. దీని ప్రోమో విడుదలైంది. ఇందులో హైపర్ ఆది వేసిన కొన్ని పంచులు మంచు కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవని చూసిన వాళ్లకు ఈజీగా అర్థం అవుతుంది.

Hyper Aadi-Manchu Vishnu: మంచు విష్ణును ఘోరంగా అవమానించిన హైపర్ ఆది, అందరూ చూస్తుండగానే అంత మాట అనేసాడుగా..
హైపర్ ఆది, మంచు విష్ణు (Image : Facebok)

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అంటేనే కాంట్రవర్సీలను కామెడీగా వాడుకోవడంలో దిట్ట అనే చెప్పాలి. పాలిటిక్స్, సినిమా, సోషల్ మీడియా ఇలా ఏదైనా సరే, వివాదాలను తన స్కిట్ కోసం వాడేసుకుంటాడు. గతంలో హీరో బాలకృష్ణను ఉద్దేశించి చేసిన ఓ స్కిట్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో ఆయన అభిమానుల నుంచి హైపర్ ఆదికి సీరియస్ వార్నింగులు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఆది తన స్టైల్ మార్చుకోలేదు. స్కిట్ కోసం దేనికైనా సిద్ధం అంటాడు. తాజాగా తగ్గేదే లే అంటూ మల్లెమాల ప్రొడక్షన్ నుంచి ఈటీవీలో దివాళీ స్పెషల్ ఈవెంట్ వస్తుంది. దీని ప్రోమో విడుదలైంది. ఇందులో హైపర్ ఆది వేసిన కొన్ని పంచులు మంచు కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవని చూసిన వాళ్లకు ఈజీగా అర్థం అవుతుంది. ఎందుకంటే మెగా కాంపౌండ్ కమెడియన్ గా పేరొందిన హైపర్ ఆది, ఏకంగా మా అధ్యక్షుడు మంచు విష్ణును టార్గెట్ చేసాడు. అంతేకాదు దారుణంగా ట్రోల్ చేసాడు.

మా ఎన్నికల సందర్భంగా జరిగిన పంచాయితీ తెలుగు ఇండస్ట్రీని రెండుగా చీల్చేసింది. ముఖ్యంగా విష్ణు, ప్రకాశ్ రాజ్ వర్గాల మధ్య గొడవ  ముదిరి, నువ్వంటే నువ్వు అంటూ ఒకరిపై ఒకరు బూతుల వర్షం కూడా కురిపించుకున్నారు. ఏకంగా కొరుకడం, రక్కడం వరకూ దిగజారాయి. ప్రకాశ్ రాజ్ ను క్రమంలోనే మంచు విష్ణు మాట్లాడిన కొన్ని మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఓ ప్రెస్ మీట్‌లో మీడియా ముందు ఏదో మాట్లాడబోతుంటే పక్కనే ఉన్న నరేష్.. మంచు విష్ణును ఆపడానికి చూస్తాడు. నన్ను ఆపొద్దు అంకుల్.. లెట్ దెమ్ నో.. ఏమైందో వాళ్ళకు తెలియాలి కదా అంటాడు. ఈ రోజు శ్రీహరి అంకుల్ కానీ బతకుండుంటే మీ బండారం అంతా బయటికి వచ్చేదంటూ ప్రకాశ్ రాజ్‌పై విష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అలాగే ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో భాగంగా ఆయనకు తెలుగు భాషపై పట్టు శూన్యం.. ఏది టంగుటూరి పకాహం.... గురించి మాట్లాడమనండి అంటూ ప్రకాశ్ రాజ్‌ను సవాల్ చేసాడు మంచు విష్ణు. ఆ మాటలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీటినే తన స్కిట్ కోసం వాడుకున్నాడు ఆది. రోజా, ఇంద్రజను టార్గెట్ చేస్తూ.. లెట్ దెమ్ నో అంకుల్ అంటూ సెటైర్లు వేసాడు. మీకు స్క్రిప్టుపై పట్టు శూన్యం.. ఏది గురజాడ గురించి మాట్లాడమనండి చూద్దాం అంటూ సెటైర్లు వేసాడు. మంచు విష్ణును టార్గెట్ చేస్తూ హైపర్ ఆది వేసిన ఈ పంచులకు పగలబడి నవ్వుతున్నారు ఆడియన్స్.

(The above story first appeared on LatestLY on Oct 30, 2021 10:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).