Shanmukh-Deepthi Sunaina Breakup: అవును నిజమే..దీప్తి సునైనా నాకు బ్రేకప్ చెప్పేసింది, నిజం ఒప్పుకున్న షణ్ముఖ్ జస్వంత్, సిరితో నాది జస్ట్ ఫ్రెండ్షిప్పే..కొంప ముంచిన ముద్దులు
'ప్రస్తుతం తనని బ్లాక్ చేసిందని, దీంతో త్వరలోనే హైదరాబాద్ వెళ్లి తనని కలుస్తానని చెప్పుకొచ్చాడు. దీపు నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను.
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గురించి యువతకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్ సీజన్-5లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి, చివరకు రన్నరప్ గా నిలిచాడు. యాంకర్ సిరితో రిలేషన్, పదేపదే ముద్దులతో చెడ్డ ఇమేజీని మూటగట్టుకున్నాడు. ఫలితంగా సన్నీ చేతిలో టైటిల్ చేజార్చుకొని రన్నరప్‌గా నిలిచాడు. అయితే నిజానికి సిరికి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే ముందే శ్రీహాన్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. అటు షణ్నూ, దీప్తి సునయనతో రిలేషన్ షిప్‌లో ఉన్నానని నాగార్జున ముందే చెప్పాడు. అయినప్పటికీ సిరి, షన్ను రొమాన్స్ తో రెచ్చిపోయారు. దీంతో వీరి రిలేషన్ ఆడియెన్స్‌కు అంతగా రుచించలేదు. దీంతో సోషల్ మీడియాలో సిరి-షణ్నూలు విపరీతమైన ట్రోలింగ్ బారిన పడ్డారు.
ఇటీవలె బిగ్‌బాస్ ముగియడంతో హౌస్ నుంచి బయటకు వచ్చిన షణ్నూ.. తాజాగా ఇన్‌స్టాలో లైవ్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. దీప్తి సునయన గురించి ఎక్కువగా అడుగుండటంతో షణ్నూ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తనని బ్లాక్ చేసిందని, దీంతో త్వరలోనే హైదరాబాద్ వెళ్లి తనని కలుస్తానని చెప్పుకొచ్చాడు. దీపు నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్ అయితే జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను' అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు సిరితో తన ఫ్రెండ్షిప్ సైతం కంటిన్యూ అవుతుందని, జెస్సీ, సిరిలు తన బెస్ట్‌ఫ్రెండ్స్ అని తెలిపాడు.
(The above story first appeared on LatestLY on Dec 30, 2021 02:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

