Sudigali Sudheer Marriage: నిజంగానే ఓ ఇంటి వాడవుతున్న జబర్దస్త్ సుడిగాలి సుధీర్, తేజస్వినీ నాయుడు అనే యువతితో ఎంగేజ్మెంట్, యాంకర్ రష్మీతో పూర్తిగా బ్రేకప్
సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడు అవుతున్నాడనే వార్త నిజం అవుతోంది. సుధీర్ - రష్మీ కెమిస్ట్రీ అంటూ ఇనాళ్లు సాగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లే, తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకు సంబంధించిన కొత్త ప్రోమో విడుదలైంది. ఇందులో రష్మీ కాకుండా మరో అమ్మాయితో సుడిగాలి సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్ చేశారు.
జబర్దస్త్ షోలో టీం కంటెస్టెంట్ గా వచ్చి టీం లీడర్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు సుధీర్. జబర్దస్త్ లో ఫేమ్ రావడంతో సుధీర్ కి వేరే షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక పక్క టీవీ షోలు, వేరే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరో పక్క హీరోగానూ సినిమాలు నటించాడు సుధీర్.
వెండితెరపై కూడా తన క్రేజ్ ని సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ద్వారా చూపించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఏ షోలో చూసినా కామన్ గా కనిపించేది సుధీర్ ను ప్లే బాయ్ గా చూపించేస్తారు. దానికే వ్యూస్ వస్తుండడంతో సుధీర్ కూడా అలానే కంటిన్యూ అయిపోతున్నాడు. అయితే.. ఈ కామెంట్స్ కి కళ్లెం పడాలంటే సుధీర్ ఓ ఇంటి వాడలవ్వాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుంటారు. అప్ప్పుడప్పుడు సుధీర్ పెళ్లి కూడా జరిగిపోయిందని ప్రచారం కూడా చాలాసార్లే చూశాం.
అయితే ఇప్పుడు మాత్రం సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడు అవుతున్నాడనే వార్త నిజం అవుతోంది. సుధీర్ - రష్మీ కెమిస్ట్రీ అంటూ ఇనాళ్లు సాగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లే, తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకు సంబంధించిన కొత్త ప్రోమో విడుదలైంది. ఇందులో రష్మీ కాకుండా మరో అమ్మాయితో సుడిగాలి సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్ చేశారు. అందరి ముందే అతడు ఆమె చేతికి ఉంగరం తొడిగి ఉండగా.. డ్రామా కంపెనీ ఆర్టిస్టులంతా కలిసి ఈ ఎంగేజ్మెంట్ చేసేశారు. దీంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయిపోయింది. ఇది షో కోసం కాదని.. నిజంగానే సుధీర్ ప్రేయసిని పరిచయం చేశాడని చెబుతున్నారు. అయితే సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోయే యువతి ఓ మోడల్ అని ఆమె పేరు తేజస్వీని నాయుడు అనే పేరు వినిపిస్తోంది. మొత్తానికి సుధీర్ ఓ ఇంటివాడు అయ్యాడన్న మాట.
(The above story first appeared on LatestLY on Mar 04, 2022 06:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

