COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 402 మందికి కొవిడ్ పాజిటివ్, మరో 412 మంది రికవరీ, రాష్ట్రంలో 3,9780గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
అత్యధికంగా చిత్తూరు నుంచి 86, కృష్ణా జిల్లా నుంచి 72 కేసులు మినహా మిగతా జిల్లాల్లో 40 లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు....
Amaravati, December 22: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ తీవ్రత భారీగా తగ్గుముఖం పట్టింది అయినప్పటికీ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. దీనికి తోడు కొవిడ్ సెకండ్ ఉండే అవకాశం ఉందనే సమాచారం మరియు కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తుంది.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,425 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 402 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,79,339కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,76,444గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా చిత్తూరు నుంచి 86, కృష్ణా జిల్లా నుంచి 72 కేసులు మినహా మిగతా జిల్లాల్లో 40 లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో మరో 4 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7082కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 412 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,68,279 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 3,978 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Dec 22, 2020 07:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

