MILKYWAY Tablet With BharatGPT: ఎపిక్ ఫౌండేషన్ అనే సంస్థ 'మిల్క్‌వే' పేరుతో దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ తయారీ ఎడ్యుకేషన్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇది పూర్తిగా మేడ్- ఇన్- ఇండియా టాబ్లెట్, దీనిని MediaTek మరియు CoRover.ai సహకారంతో VVDN టెక్నాలజీస్ రూపొందించింది.
ఈ MILKYWAY టాబ్లెట్ చాలా ప్రత్యేకమైనది, ఇది ChatGPTకి దేశీయ అవతారంగా చెప్పే BharatGPT ద్వారా ఆధారితమైనది. అనేక AI-సెంట్రిక్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్‌ను సులభంగా రిపేర్ చేయవచ్చు, అప్‌గ్రేడ్ చేయవచ్చు.
అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఇంటిగ్రేషన్ కలిగి ఆపరేటింగ్ చాలా సులభతరంగా ఉంటుంది.
దేశీయంగా విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ టాబ్లెట్‌ను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యను మరింత చేరువచేసేలా, రాష్ట్ర ప్రభుత్వాల కోసం మూడు లక్షల టాబ్లెట్‌లను తయారు చేయాలన్నది కంపెనీ లక్ష్యం.
ఈ టాబ్లెట్ విద్యార్థులకు చాలా రకాలుగా సహాయపడుతుంది. BharatGPT వర్చువల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ అసిస్టెంట్, వీడియో చాట్ అసిస్టెంట్ కలిగి ఉంటుంది. డిజిటల్ లర్నింగ్ మరింత సులభతరం చేస్తూ.. ఉపన్యాసకులు ఏ భాషలో మాట్లాడినా, వారి మాతృభాషకు అనువాదం చేస్తుంది. ఇందులో రియల్ టైమ్ స్పీచ్ ట్రాన్స్‌లేషన్ యాప్ ఉంటుంది. ఇక, హార్డ్‌వేర్ పరంగా, మిల్క్‌వే ట్యాబ్లెట్‌లో ఎలాంటి ఫీచర్లు,స్పెసిఫికేషన్‌లను కలిగి ఉందో ఈ కింద పరిశీలించండి.
MILKYWAY Tablet ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 8-అంగుళాల 1280x800 IPS HD డిస్‌ప్లే
- 3GB/4GB RAM, 32GB/64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టా-కోర్ మీడియాటెక్ MT8766A ప్రాసెసర్
- వీడియో కాల్స్ కోసం 8MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా
- ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 5100 mAh బ్యాటరీ సామర్థ్యం
కనెక్టివిటీ కోసం, బ్లూటూత్ 5.0, Wi-Fi , 4G LTE , BharatGPT పవర్డ్ AI మొదలైనవి ఉన్నాయి.
ఈ టాబ్లెట్ మార్కెట్ విడుదల తేదీ ఇంకా ప్రకటించనందున ధరలను ఇంకా నిర్ణయించలేదు, త్వరలో ఆ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.