Andhra Pradesh: ఏపీలో యధావిధిగానే స్కూళ్లు, సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్

ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని.. ప్రకటించిన విధంగానే యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని (No Plans to Extend Holidays For Schools ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Andhra Pradesh: ఏపీలో యధావిధిగానే స్కూళ్లు, సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్
AP Education Minister Adimulapu Suresh (Photo-ANI)

Amaravati, Jan 17: ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని.. ప్రకటించిన విధంగానే యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని (No Plans to Extend Holidays For Schools ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన (Education minister Adimulapu Suresh) చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

(The above story first appeared on LatestLY on Jan 17, 2022 12:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).