Inter Exams in TS: తెలంగాణలో మే1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఏప్రిల్ 1న మరియు ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఏప్రిల్ 3న జరగనున్నాయి. వొకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ఇంటర్మీడియట్ బోర్డ్ స్పష్టం చేసింది....
Hyderabad, January 28: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ఐపిఇ) 2021 మే 1 నుండి ప్రారంభం అవుతున్నాయి.
మే 1న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ద్వితీయ భాషా పేపర్ -1 తో ప్రారంభమవుతుండగా, ఆ మరుసటి రోజు మే 2న సెకండ్ ఇయర్ పరీక్షలు ద్వితీయ భాషా పేపర్ II తో ప్రారంభం అవుతున్నాయి.
దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు. కాగా, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 7 నుంచి 20 వరకు జరుగుతాయని మంత్రి వెల్లడించారు.
అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఏప్రిల్ 1న మరియు ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఏప్రిల్ 3న జరగనున్నాయి. వొకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ఇంటర్మీడియట్ బోర్డ్ స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలతో సహా తత్సమాన విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి తిరిగి తెరుచుకోనున్న విషయం తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Jan 28, 2021 06:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

