APPSC Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, యూనివర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రాసెస్ మొదలు పెట్టింది. టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లోని ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

APPSC Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, యూనివర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
AP Government logo (Photo-Wikimedia Commons)

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రాసెస్ మొదలు పెట్టింది. టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లోని ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

ఈ రోజు (అక్టోబర్ 31) నుంచే ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కాగా, అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా పారదర్శకంగా జరపనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్టంగా 10 మార్కుల వెయిటేజ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

పోస్టుల వివరాలు..

ప్రొఫెసర్ - 418

అసోసియేట్ ప్రొఫెసర్ - 801

అసిస్టెంట్ ప్రొఫెసర్ -2001

దరఖాస్తు ఫీజు..

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు (ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు) రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు అభ్యర్థులు రూ.2 వేలు

ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు.. రూ.3 వేలు (అన్ని కేటగిరీల అభ్యర్థులు)

ప్రవాస భారతీయులు..

ప్రొఫెసర్‌ పోస్టులు: రూ.150 డాలర్లు (రూ.12,600)

అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 100 డాలర్లు (రూ.8,400)

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: ప్రవాస భారతీయులు 50 డాలర్లు (రూ.4.200)

దరఖాస్తు విధానం..

దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో నవంబర్ 20 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీని ఉన్నత విద్యామండలికి పోస్ట్ ద్వారా 27 వ తేదీలోపు పంపించాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను నవంబర్ 30 ప్రకటించి, డిసెంబర్ 8న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Oct 31, 2023 01:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).