Weather Update: నేడు మరో అల్పపీడనం, ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం

నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం (Low pressure) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు.

Weather Update: నేడు మరో అల్పపీడనం, ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం
Andhra Pradesh Heavy rains (Photo-ANI)

Amaravati, Nov 30: నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం (Low pressure) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు (AP Rain Updates)కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. కోమరిన్ దానిని అనుకుని ఉన్న శ్రీలంక తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది.

దక్షిణ అండమాన్‌లో (Southern Andaman‌) నేడు ఏర్పడనున్న కొత్త అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మళ్లీ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు మరో వర్షపు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు డిసెంబర్ 2 వరకు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ, దక్షిణ అండమాన్‌ సముద్రంలో 30న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం

బంగాళాఖాతాంలో వాయుగుండం ఏర్పడి దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది. తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అల్ప పీడనం ప్రభావం అధికమైతే దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దక్షిణ అండమాన్‌లో నేడు ఏర్పడనున్న మరో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఎక్కడో ఓ చోట తేలికపాటి నుంచి చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.

(The above story first appeared on LatestLY on Nov 30, 2021 10:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).