LPG Price Hike: దసరా పండుగ వేళ గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్.. మరింత ప్రియమైన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర..
దసరా పండుగ సీజన్ వేళ వ్యాపార వర్గాలకు, గ్యాస్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ నెల తొలి రోజే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలను మళ్లీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
LPG Price Hike: దసరా పండుగ సీజన్ వేళ వ్యాపార వర్గాలకు, గ్యాస్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ నెల తొలి రోజే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలను మళ్లీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా రూ.62.50 పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, క్యాటరింగ్ వ్యాపారులపై తీవ్ర అదనపు భారం పడనుంది.
అయితే గృహ వినియోగదారులకు (14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్) మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడంతో ఊరట లభించింది. సెప్టెంబర్ నెలలో కూడా కమర్షియల్ సిలిండర్‌పై రూ.9.50 పెరిగిన విషయం తెలిసిందే. తాజా పెంపుతో పండుగ వేళ వ్యాపార నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2026లో బ్యాంకులకు 10 రోజులకు పైగా సెలవులు.. గాంధీ జయంతి, దసరా, దుర్గాపూజతో పూర్తి లిస్ట్ ఇదే..
తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కమర్షియల్ (19 కేజీల) సిలిండర్ ధరలు:
హైదరాబాద్: రూ. 3,058.50
ఢిల్లీ: రూ. 2,810.00
చెన్నై: రూ. 2,979.00
కోల్‌కతా: రూ. 2,946.50
ముంబై: రూ. 2,763.50
స్థిరంగానే గృహ వినియోగ డొమెస్టిక్ (14.2 కేజీల) సిలిండర్ ధరలు:
కమర్షియల్ సిలిండర్ల భారం పెరిగినప్పటికీ, 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలను కంపెనీలు మార్చకుండా యథాతథంగా ఉంచాయి. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో గృహ వినియోగ గ్యాస్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
హైదరాబాద్: రూ. 994.00
కోల్‌కతా: రూ. 968.00
చెన్నై: రూ. 957.50
ఢిల్లీ: రూ. 942.00
ముంబై:రూ. 941.50
పండుగల సమయంలో హోటళ్లు, క్యాటరింగ్ సేవలకు డిమాండ్ ఎక్కువగా ఉండే తరుణంలో ఈ తరహా ధరల పెంపు ప్రభావం చివరకు వినియోగదారులపై పడే అవకాశం ఉంది.
(The above story first appeared on LatestLY on Oct 01, 2026 08:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

