New Rules From October 1: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి జీతం, PF, బ్యాంకింగ్‌పై కీలక మార్పులు..

New Rules From October 1: దేశంలో అక్టోబరు 1 నుంచి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ చెల్లింపులు, పెన్షన్ రంగానికి సంబంధించి పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు.. పారదర్శకతను పెంచే లక్ష్యంతో నియంత్రణ సంస్థలు ఈ మార్పులను తీసుకొచ్చాయి.

New Rules From October 1: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి జీతం, PF, బ్యాంకింగ్‌పై కీలక మార్పులు..
Rs 500 Note (Photo-X)

New Rules From October 1: దేశంలో అక్టోబరు 1 నుంచి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ చెల్లింపులు, పెన్షన్ రంగానికి సంబంధించి పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు.. పారదర్శకతను పెంచే లక్ష్యంతో నియంత్రణ సంస్థలు ఈ మార్పులను తీసుకొచ్చాయి. ఇవి సామాన్య ఖాతాదారుల నుండి వ్యాపారుల వరకు అందరి దైనందిన బడ్జెట్, నిర్వహణపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఎగుమతులు, దిగుమతులపై RBI కొత్త నిబంధనలు.. అక్టోబర్ 1 నుంచి అమలు.. ఇవి తప్పక తెలుసుకోండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ సాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు అందుబాటులో ఉన్న 10 ఉచిత లావాదేవీల పరిమితిని సగానికి అంటే 5 లావాదేవీలకు తగ్గించింది. ఈ పరిమితి ఆర్థిక (నగదు ఉపసంహరణ), ఆర్థికేతర (బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ ఛేంజ్) లావాదేవీలు రెండింటికీ వర్తిస్తుంది. పరిమితి దాటితే ప్రతి లావాదేవీపై రూ.15తో పాటు జీఎస్టీ ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రాథమిక సేవింగ్స్ డిపాజిట్ (BSBD) ఖాతాదారులకు నెలకు లభించే 4 ఉచిత ఉపసంహరణల నిబంధనలో ఎలాంటి మార్పు లేదు. డిజిటల్ Banking లావాదేవీలు యథాతథంగా ఉచితంగానే కొనసాగుతాయి.

పెద్ద మొత్తంలో జమ చేసే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (రూ. 3 కోట్లు, ఆపైబడినవి) ధరల నిర్ణయంలో పారదర్శకత తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ తెచ్చింది. ప్రతి బ్యాంక్ రోజూ ఉదయం 10 గంటలలోపు ఆ రోజుకు వర్తించే బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను తమ వెబ్‌సైట్‌లో ప్రచురించడం తప్పనిసరి. సమానమైన మొత్తాలు, కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఒకే రకమైన వడ్డీ రేటు వర్తింపజేయాలి. లిక్విడిటీ కవరేజ్ నిష్పత్తి (LCR) ఆధారంగా మాత్రమే రేట్లలో వ్యత్యాసాలకు అనుమతి ఉంటుంది.

అక్టోబరు 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార (P2M) డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుంది. సాధారణ వ్యక్తుల మధ్య జరిపే (P2P) లావాదేవీలు, అలాగే రూ.2,000 లోపు ఉండే చిన్న తరహా వ్యాపార చెల్లింపులు మునుపటిలాగే పూర్తిగా ఉచితంగా ఉంటాయి. ఈ మార్పు వల్ల దేశంలోని దాదాపు 96 శాతం డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని అధికారులు స్పష్టం చేశారు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లైట్ ఖాతాలను పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (PoP) ద్వారా ప్రారంభించే చందాదారులకు కొత్త రుసుము అమల్లోకి రానుంది. ప్రాణ్‌ (PRAN) కార్డ్ నమోదు ప్రక్రియ కోసం ఇకపై ఒకసారి చెల్లించే ఆన్‌బోర్డింగ్ ఛార్జీ కింద రూ.200 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది.

సబ్సిడీ ధరకే వంటగ్యాస్ రీఫిల్ పొందే అర్హత కలిగిన వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (BAA) పూర్తి చేసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 89.9 శాతం మంది (27.43 కోట్ల మంది) ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా పూర్తి చేయని వినియోగదారులు గ్యాస్ డెలివరీ సమయంలో సిలిండర్ ఇచ్చే ఏజెంట్ ద్వారా లేదా సంబంధిత గ్యాస్ ఏజెన్సీ మొబైల్ యాప్ ద్వారా ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేసుకోవచ్చు.

మొత్తంగా చూసినట్లయితే బ్యాంకింగ్ నగదు వినియోగాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, సేవల ధరలలో ఏకరూపత తేవడమే లక్ష్యంగా అక్టోబరు 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తున్నాయి.

(The above story first appeared on LatestLY on Sep 29, 2026 12:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).