Karnataka Election Results 2023, Who is Sunil Kanugolu: కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న వ్యూహకర్త సునీల్ కనుగోలు గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే...
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న సూత్రధారి సునీల్ కునగోలు బృందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ టీం చేసిన సర్వే ఆధారంగా కర్ణాటక కాంగ్రెస్ ఈసారి ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు దోహదపడింది.
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న సూత్రధారి సునీల్ కునగోలు బృందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ టీం చేసిన సర్వే ఆధారంగా కర్ణాటక కాంగ్రెస్ ఈసారి ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు దోహదపడింది. ఈ సారి ఎన్నికల్లో మోదీని వ్యక్తిగతంగా విమర్శించవద్దని, హిందూ-ముస్లిం అంశాన్ని ప్రస్తావనకు తీసుకురావద్దని సునీల్ కనుగోలు టీమ్ సూచించింది. ఇది కాకుండా దాదాపు 70 స్థానాల్లో కాంగ్రెస్ విజయం దాదాపు ఖాయమని ఎన్నికలకు ముందే సునీల్ కనుగోలు టీం అంచనా వేసింది. అంతేకాదు కాంగ్రెస్ టఫ్ అనుకున్న సీట్లను గుర్తించి ఇప్పుడు అక్కడ దాదాపు 60 సీట్లను కైవసం చేసుకొని కాంగ్రెస్ ఏకంగా 130 సీట్లలో ఇప్పుడు విజయం సాధించింది. సునీల్ కనుగోలు కర్ణాటక కాంగ్రెస్ మొత్తం సంబరాలు చేసుకునేలా పనిచేశారు.
ఒకవైపు బీజేపీ ప్రతిష్టను పెంచేందుకు బీజేపీ ఐటీ సెల్ భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. మొన్నటి వరకు బీజేపీ వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కోలేక సతమతమవుతున్న రాష్ట్ర కాంగ్రెస్.. పేసీఎం ప్రచారంతో దూసుకెళ్లింది. బెంగళూరును ఐటీ హబ్‌లో ఈ ప్రచారం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ప్రముఖ డిజిటల్ వాలెట్ కంపెనీ పేరును మార్చి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ ఆరోపణలను ప్రజలకు చేరవేయడంలో పేసీఎం ప్రచారం విజయం సాధించింది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం 40% ప్రభుత్వం అని కాంగ్రెస్ చేసిన ప్రచారం వెనుక సునీల్ కనుగోలు టీం ఉంది.
ఇక సర్వేల లెక్కన చూస్తే సునీల్ టీమ్ గత ఎనిమిది నెలల్లో మొత్తం ఐదు సర్వేలు చేసింది. ఈ సర్వే ద్వారా కాంగ్రెస్ కనీసం 70కి పైగా హాట్ సీట్లను పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రాంతాల్లో ఏఐసీసీ పరిశీలకులను రిజర్వు చేసింది. గత మేలో, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సునీల్ కనుగోలును పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల టాస్క్‌ఫోర్స్‌లో సభ్యునిగా నియమించారు, ఇందులో సీనియర్ నాయకులు పి చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కెసి వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా మరియు రణదీప్ సింగ్ ఉన్నారు. ఈ కమిటీలో ఏఐసీసీ నేత సూర్జేవాలా కూడా కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
(The above story first appeared on LatestLY on May 13, 2023 04:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

