Minor Rape: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, కారులో తీసుకెళ్లి నడి రోడ్డుపై లైంగిక దాడి, పోలీసుల రాకతో నిందితులు పరార్, 5 గురిని అదుపులో తీసుకున్న పోలీసులు
Representative image

Ranchi: ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన ఝార్ఖండ్ లోని రాంచీలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. శుక్రవారం రాత్రి ధుర్వా రింగురోడ్డుపై కారులో వెళ్తున్న యువకులు.. పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.

ఆ రాత్రి రతు పీఎస్ పరిధిలో దలాదలి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. రెస్టారెంటు వద్ద ఆగి ఉన్న కారు కనిపించింది. కారు అనుమానాస్పదంగా ఉండటంతో.. పెట్రోలింగ్ పోలీసులు కారును తనిఖీ చేశారు.

దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై వృద్ధులు గ్యాంగ్ రేప్, రాత్రంతా రూంలో బంధించి అత్యాచారం, తెలంగాణలో షాకింగ్ ఘటన వెలుగులోకి

కారులోపల ఏడుస్తూ కూర్చున్న బాలికను ఏం జరిగిందని అడగ్గా.. తనపై జరిగిన దారుణం గురించి వివరించింది. వెంటనే బాలికను వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రాంచీ ఎస్పీ నౌషద్ ఆలమ్ తెలిపారు.