Bank Holidays in June: జూన్‌లో బ్యాంకులకు 11రోజులు సెలవులు, ఇవి తెలుసుకోకుండా వెళ్తే అంతే సంగతులు, జూన్ నెలలో బ్యాంకు సెలవుల పూర్తి వివరాలు ఇవిగో!
మరో వారం రోజుల్లో మే ముగిసి జూన్ (June) నెల ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో జూన్ నెల సెలవుల జాబితాను ఆర్బీఐ (RBI)విడుదల చేసింది. బ్యాంకుల్లో పని ఉంటే.. ఏయే రోజుల్లో బ్యాంకులు (Banks)పని చేస్తాయి.. ఏ రోజు సెలవు (Holidays) ఉంటుంది తెలుసుకని ముందుగానే తెలుసుకుంటే ఇబ్బందులు ఉండవు.
New Delhi, May 27: మరో వారం రోజుల్లో మే ముగిసి జూన్ (June) నెల ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో జూన్ నెల సెలవుల జాబితాను ఆర్బీఐ (RBI)విడుదల చేసింది. బ్యాంకుల్లో పని ఉంటే.. ఏయే రోజుల్లో బ్యాంకులు (Banks)పని చేస్తాయి.. ఏ రోజు సెలవు (Holidays) ఉంటుంది తెలుసుకని ముందుగానే తెలుసుకుంటే ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా సెలవు ఉందా? లేదా? అన్న విషయం తెలియకుండా వెళితే బ్యాంకులకు సెలవు ఉంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కనుక మీ బ్యాంకు శాఖకు వెళ్లే ముందు ఒక్కసారి సెలవుల జాబితాను చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రాల పండుగల వారీగా ఆర్బీఐ సెలవులు ఖరారు చేసింది. ఆదివారాలు, రెండో/ నాలుగో శనివారం కాకుండా వివిధ రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక సెలవులు ఉన్నాయి.. అవేంటో ఓసారి చూద్దాం..
జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మహారాణా ప్రతాప్ జయంతి – తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లలో సెలవు.
జూన్ 3 : శ్రీ గురు అర్జున్‌దేవ్ జీ అమరవీరుల దినోత్సవం (పంజాబ్‌లో మాత్రమే సెలవు)
జూన్ 5 : ఆదివారం
జూన్ 11 : రెండో శనివారం
జూన్ 12: ఆదివారం
జూన్ 14 : గురు కబీర్ జయంతి- ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా, పంజాబ్‌లలో సెలవు.
జూన్ 15: వైఎంఏ డే- గురు హరగోవింద్ జీ జయంతి – ఒడిశా, మిజోరం, జమ్ముకశ్మీర్‌లలో సెలవు.
జూన్ 19: ఆదివారం
జూన్ 22: ఖర్చీ పూజ (త్రిపురలో మాత్రమే సెలవు)
జూన్ 25 : నాల్గో శనివారం
జూన్ 26 : ఆదివారం
(The above story first appeared on LatestLY on May 27, 2022 11:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

