Bengaluru Shocker: నడిరోడ్డు మీదే..అదీ కొడుకు కళ్ల ఎదుటే కత్తులతో మహిళను దారుణంగా నరికి చంపిన ఆమె మాజీ భర్త, అతని అనుచరులు, ఐటీ సిటీ బెంగుళూరులో దారుణ ఘటన
కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటి పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసూరు రోడ్డు జంక్షన్ వద్ద సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో అర్చనా రెడ్డి (38) అనే మహిళను ఆమె రెండవభర్త నవీన్ కుమార్, మరో ఇద్దరితో కలికి కత్తులతో దారుణంగా నరికి (Bengaluru Shocker) చంపాడు.
Bengaluru, Dec 29: కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటి పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసూరు రోడ్డు జంక్షన్ వద్ద సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో అర్చనా రెడ్డి (38) అనే మహిళను ఆమె రెండవభర్త నవీన్ కుమార్, మరో ఇద్దరితో కలికి కత్తులతో దారుణంగా నరికి (Bengaluru Shocker) చంపాడు.
దారుణ ఘటన వివరాల్లోకి వెళితే... ఆనేకల్ జిగణికి చెందిన అర్చనకు మొదట పెళ్లయి ఒక కొడుకు ఉన్నాడు. భర్తతో గొడవలు వచ్చి విడిపోయి, తరువాత నవీన్‌కుమార్‌ను రెండవ పెళ్ళి చేసుకుంది. ఆస్తుల విషయంలో అతనితోనూ గొడవలు వచ్చి అతనితోనూ విడాకులు తీసుకుంది. బెళ్లందూరులో విడిగా నివసిస్తోంది. పురసభ ఎన్నికల్లో ఓటు వేసి రాత్రి 10:30 గంటలకు కారులో డ్రైవర్, కొడుకుతో కలిసి ఇంటికి వెళుతోంది. కాపు కాసిన నవీన్‌కుమార్ (cops suspect ex-husband’s role), అనుచరులు కారును హోసూరు రోడ్డు జంక్షన్ వద్ద అటకాయించి దాడి చేశారు. ఆమె కుమారుడు ముందే కారులో ఉన్న అర్చనా రెడ్డిని ముగ్గురు కలిసి దారుణంగా నరికి హత్య చేసి (Woman killed in front of son) వెళ్లిపోయారు. కొడవళ్లు, కత్తులతో దాడికి గురైన అర్చనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు పరిశీలించి ఆమె కుమారుడు, డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా భూవివాదానికి సంబంధించి దంపతులు కొంతకాలంగా గొడవ పడుతున్నారని, జిగాని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని పోలీస్ వర్గాలు తెలిపాయి. జిగానిలో అర్చనకు ఇల్లు ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Dec 29, 2021 11:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

