Maharashtra Tragedy: గుండెలు పగిలే వీడియో ఇదిగో.. ఐఫోన్ ఈఎంఐ ముగ్గురి ప్రాణాలను బలిగొంది.. కొండపై నుండి జారిపడి తండ్రి, కొడుకు మృతి..తట్టుకోలేక తల్లి కూడా కొండ పైనుంచి..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా వాలూజ్ సమీపంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ఫోన్ వల్ల మొదలైన చిన్న కుటుంబ వివాదం చివరికి ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Maharashtra Tragedy: గుండెలు పగిలే వీడియో ఇదిగో.. ఐఫోన్ ఈఎంఐ ముగ్గురి ప్రాణాలను బలిగొంది.. కొండపై నుండి జారిపడి తండ్రి, కొడుకు మృతి..తట్టుకోలేక తల్లి కూడా కొండ పైనుంచి..
Father Falls While Trying To Save Son, Mother Dies Moments Later (Photo Credits: X/@AMIT_GUJJU)

Maharashtra Tragedy: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా వాలూజ్ సమీపంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ఫోన్ వల్ల మొదలైన చిన్న కుటుంబ వివాదం చివరికి ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

తిస్గావ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే, ఇంట్లో వారికి చెప్పకుండా కొత్త ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే, దాని నెలవారీ ఈఎంఐ (EMI) చెల్లించడం కష్టం కావడంతో తండ్రి మురళీధర్‌ను సహాయం కోరాడు. కొడుకు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి, అతడిని తీవ్రంగా మందలించాడు. శుక్రవారం ఉదయం ఈ విషయమై ఇంట్లో పెద్ద గొడవ జరగడంతో, తీవ్ర తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్ సమీపంలోని ఖవాడ్యా కొండపైకి వెళ్లి దూకుతానంటూ బెదిరించడం ప్రారంభించాడు.

Teen Falls From Khavda Hill

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, మాజీ సర్పంచ్, స్థానికులు కొండపైకి చేరుకుని అతడిని కిందకు దించేందుకు దాదాపు మూడు గంటల పాటు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కింద పోలీసులు వలతో సిద్ధంగా ఉన్నారని గమనించిన కునాల్, మరో అంచుకు వెళ్లి దూకేందుకు సిద్ధమయ్యాడు.

ఒంగోలులో ఘోర లిఫ్ట్ ప్రమాదం వీడియో ఇదిగో.. తలుపులు తెరిచి ఉండగానే కదిలిన లిఫ్ట్.. తీవ్ర గాయాలతో మహిళ మృతి..

కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటంతో తండ్రి మురళీధర్ కొండ అంచు వద్దకు వెళ్ళి అతడిని వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో బ్యాలెన్స్ తప్పి కునాల్ పడిపోతూ తండ్రిని కూడా కిందకు లాగేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలై ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే భర్త, కొడుకు కొండపై నుంచి పడిపోవడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లి సంగీత, మరుక్షణం ఆలోచించకుండా అదే కొండపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఒక ఐఫోన్ ఈఎంఐ విషయంలో తలెత్తిన చిన్న వివాదం, క్షణికావేశం వల్ల నిమిషాల వ్యవధిలో ఒక కుటుంబం మొత్తాన్ని బలితీసుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Aug 22, 2026 12:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).