Bihar Caste Survey: రిజర్వేషన్లు 65 శాతానికి పెంచే ప్రతిపాదన, కీలక నిర్ణయం తీసుకున్న బీహార్ ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..
రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో రిజర్వేషన్లను 65శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు 50శాతం ఉండగా.. తాజాగా వాటిని 65శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Patna, Nov 7: రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో రిజర్వేషన్లను 65శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు 50శాతం ఉండగా.. తాజాగా వాటిని 65శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్రం నిర్దేశించిన 10శాతం రిజర్వేషన్లకు మినహయింపు. బిహార్ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75శాతానికి చేరుకోనుంది.
ఆర్థికంగా బలహీనవర్గాలకు (EWS)కు చెందిన వారికి న్యాయ సర్వీసులు, ప్రభుత్వ న్యాయ కళాశాలలు, యూనివర్సిటీల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు నితీశ్ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా ప్రతిపాదనల ప్రకారం, ఎస్సీలకు 20శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలు కలిపి 30శాతం ఉండగా.. తాజా పెంపుతో అవి 43శాతం కానున్నాయి. మరోవైపు ఎస్టీలకు 2శాతాన్ని ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్‌లు ఉన్నాయి.
కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మార్పులు అమలు చేయాలనేది తమ ఉద్ధేశ్యమని తెలిపారు. అయితే ఓబీసీ మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఓబీసీ వర్గం వారిలో యాదవులు అత్యధిక సంఖ్యలలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14. 27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బిహార్ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు.
(The above story first appeared on LatestLY on Nov 07, 2023 08:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

