Cyclone Mythili Update: ఏపీకి తప్పిన మిధిలీ తుపాను ముప్పు, అయినా పొంచి ఉన్న మరో గండం, రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనున్న సైక్లోన్

త్వరలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Cyclone Mythili Update: ఏపీకి తప్పిన మిధిలీ తుపాను ముప్పు, అయినా పొంచి ఉన్న మరో గండం, రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనున్న సైక్లోన్
Representative Image

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ., పరదీప్‌ (ఒడిశా)నకు దక్షిణ-ఆగ్నేయంగా 270 కి.మీ, దిఘా (పశ్చిమ బెంగాల్‌)కు దక్షిణ-నైరుతి దిశలో 410 కి.మీ, ఖెపుపరా (బంగ్లాదేశ్‌)కు 540 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపారు.

ఈ తుపానుకు మిధిలీ (Cyclone ‘Midhili’) అని నామకరణం చేశారు. మాల్దీవులు సూచించిన మేరకు ఈ పేరు పెట్టారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ తుపాను గంటకు 20 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ తుపాను రేపు (నవంబరు 18) తెల్లవారుజామున బంగ్లాదేశ్ తీరంలోని ఖెపుపారా వద్ద తీరం దాటనుంది. ఇది భూభాగంపైకి ప్రవేశించే సమయంలో బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 80 కి.మీ పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.ఈ తుపాను ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం పేర్కొంది.

విశాఖకు 420 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం, అల్లకల్లోలంగా మారిన సముద్రం, రానున్న మూడు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు

దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలకు అవకాశముందన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తుఫాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ నెల 1వ తేది అనంతరం ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన కారణంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, చెన్నై నుంచి పుదుకోట వరకు సముద్రంలో గాలుల వేగం కూడా పెరిగిందని, మత్స్యకారులు మరలా ఉత్తర్వులు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షసూచన, బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, పలు పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

ఇదిలా ఉండగా, విల్లుపురం, నాగపట్టణం, కడలూరు(Villupuram, Nagapattinam, Cuddalore), మైలాడుదురై జిల్లాల్లో కల్వర్టులపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు డెల్టా జిల్లాల్లో లక్షకు పైగా ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఈ నెల 19 వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముందని, తిరునల్వేలి, తెన్‌కాశి, కన్నియాకుమారి జిల్లాల్లో జాతీయ విపత్తుల నివారణ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నట్లు ఆయా జిల్లా కలెక్టర్లు తెలిపారు. చెన్నై, శివారు ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

(The above story first appeared on LatestLY on Nov 17, 2023 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).