HC On Sexual Assault Case: శారీరక సంబంధం అంటే రేప్ కాదు, పోక్సో కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు, నిందితుడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశం, కేసు పూర్వాపరాలు ఏమిటంటే..

పోక్సో చట్టం కింద నమోదైన ఒక ముఖ్యమైన కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో, బాధితురాలు తన వాంగ్మూలంలో ఉపయోగించిన శారీరక సంబంధం అనే పదాన్ని ఆధారంగా తీసుకుని నిందితుడు అత్యాచారం చేశాడని ట్రయల్ కోర్టు నిర్ణయించగా.. హైకోర్టు ఈ తీర్పును రద్దు చేసింది.

HC On Sexual Assault Case: శారీరక సంబంధం అంటే రేప్ కాదు, పోక్సో కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు, నిందితుడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశం, కేసు పూర్వాపరాలు ఏమిటంటే..
Delhi High Court (photo-ANI)

New Delhi, Oct 22: పోక్సో చట్టం కింద నమోదైన ఒక ముఖ్యమైన కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో, బాధితురాలు తన వాంగ్మూలంలో ఉపయోగించిన శారీరక సంబంధం అనే పదాన్ని ఆధారంగా తీసుకుని నిందితుడు అత్యాచారం చేశాడని ట్రయల్ కోర్టు నిర్ణయించగా.. హైకోర్టు ఈ తీర్పును రద్దు చేసింది. కేవలం శారీరక సంబంధం అనే పదం ఉపయోగించటం వల్ల, నేరం నిరూపించబడిందని భావించలేమని కోర్టు స్పష్టంగా పేర్కొన్నది.

కేసు వివరాల ప్రకారం.. రాహుల్ అలియాస్ భూపిందర్ వర్మ తన 16 ఏళ్ల కజిన్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ట్రయల్ కోర్టు అతడిని దోషిగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే నిందితుడు ఈ తీర్పును సవాలు చేసి హైకోర్టుకు అప్పీల్ చేశారు. జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించడంలో విఫలమైందని తెలిపింది.

కోర్టు అభిప్రాయం ఏమిటంటే.. కేవలం శారీరక సంబంధం అనే పదం వాడటం వలన దానికి సరైన ఆధారాలు లేకపోతే, నేరం జరిగినట్లు నిర్ధారించలేమని. భారత శిక్షాస్మృతి (IPC) లేదా పోక్సో చట్టంలో కూడా ఈ పదానికి ప్రత్యేక నిర్వచనం లేదు. అందువల్ల, బాధితురాలు ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏమిటో, అది లైంగిక దాడికి సరిపోతుందో లేదో, ట్రయల్ కోర్ట్, ప్రాసిక్యూషన్ స్పష్టత అడగలేకపోయారని తెలిపింది. Evidence Act సెక్షన్ 165 ప్రకారం సాక్షుల నుంచి సరైన వాస్తవాలను కోర్టు స్వయంగా పొందాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.

దేశ రాజధాని ఢిల్లీలో రెడ్ జోన్‌ను తాకిన వాయు కాలుష్యం, పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిక, వీడియోలు ఇవిగో..

ఇందులో మరో సమస్య ఏమిటంటే ఫిర్యాదు చాలా ఆలస్యం అయినది. ఈ సంఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత మార్చి 2016లో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. దీనిపై కూడా హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం.. నిందితుడు పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు విషం తాగిన తర్వాత మాట పడిపోయింది. అయితే తిరిగి ఆమెకు మాట వచ్చిన తరువాత ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వాదనను సమర్థించే ఎలాంటి వైద్యపరమైన సాక్ష్యాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ కేసును దురదృష్టకరమైన కేసుగా పేర్కొంది. ట్రయల్ కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను రద్దు చేసి, నిందితుడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పు కేవలం పదజాలం ఆధారంగా లైంగిక దాడి నిరూపించలేమని స్పష్టంగా గుర్తుచేసింది.

(The above story first appeared on LatestLY on Oct 22, 2025 01:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).