Haryana Pollution: కాలుష్య కట్టడికి హర్యానా కీలక నిర్ణయం, ఢిల్లీ బాటలోనే స్కూళ్లు, నిర్మాణ పనులు నిలిపివేత, ఢిల్లీ పరిసర జిల్లాల్లో ఆంక్షలు అమలు

వాయుకాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ బాటలోనే నిర్ణయం తీసుకుంది హర్యానా ప్రభుత్వం. ఇప్పటికే ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకోగా, హర్యానా కూడా అదే ఫాలో అయింది. ఈ నెల 17 వరకు ఢిల్లీ సరిహద్దు జిల్లాల్లో స్కూళ్లు బంద్ చేయనున్నట్లు ప్రకటించింది. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, సోనేపట్‌, ఝజ్జర్‌ జిల్లాల్లోని పాఠశాలలను ఈ నెల 17 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Haryana Pollution: కాలుష్య కట్టడికి హర్యానా కీలక నిర్ణయం, ఢిల్లీ బాటలోనే స్కూళ్లు, నిర్మాణ పనులు నిలిపివేత, ఢిల్లీ పరిసర జిల్లాల్లో ఆంక్షలు అమలు
Air Pollution (Representational Image/ Photo Credits: PTI)

Haryana November 15:  వాయుకాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ బాటలోనే నిర్ణయం తీసుకుంది హర్యానా ప్రభుత్వం. ఇప్పటికే ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకోగా, హర్యానా కూడా అదే ఫాలో అయింది. ఈ నెల 17 వరకు ఢిల్లీ సరిహద్దు జిల్లాల్లో స్కూళ్లు బంద్ చేయనున్నట్లు ప్రకటించింది. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, సోనేపట్‌, ఝజ్జర్‌ జిల్లాల్లోని పాఠశాలలను ఈ నెల 17 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్‌సీఆర్‌లో అన్ని నగరాల్లో అన్ని రకాల నిర్మాణ పనులను సైతం ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

నాలుగు జిల్లాల్లో జిల్లాల్లో నిర్మాణ కార్యకలాపాలు, చెత్తను కాల్చడం, మునిసిపల్ సంస్థలు వ్యర్థాలను కాల్చడంపై నిషేధం విధించింది. హర్యానా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ రోడ్లపై దుమ్మును నియంత్రించేందుకు స్వీపింగ్‌ను నిలిపివేయాలని, నీటిని చల్లాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సిబ్బంది వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించింది. రోడ్లపై వాహనాల సంఖ్యను 30 శాతానికి తగ్గించాలని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ లక్ష్యంగా నిర్దేశించుకున్నది.

తీవ్రమైన వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీలో ఇప్పటికే నిర్మాణ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. సోమవారం నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిలిపివేయగా.. వర్చువల్‌ విధానంలో కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ నెల 17 వరకు గాలులు వీస్తాయని, దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి పొగ ఢిల్లీలోకి ప్రవేశిస్తుందని కాలుష్యాన్ని పర్యవేక్షించే సంస్థలు తెలిపాయి. ఈ క్రమంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరించాయి. దీంతో నిర్మాణ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితి మరింత దారుణంగా మారితే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

సుప్రీం కోర్టు సూచన మేరకు ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించే యోచనలో ఉన్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దీనిపై కసరత్తు చేస్తున్నామని, ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించడం లేదని కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి సుప్రీం కోర్టు ముందుంచుతామని, కేంద్రంతో పాటు అన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. సీపీబీసీతో సహా పలు ఏజెన్సీ నివేదికలను పరగణలోకి తీసుకొని తీవ్ర పరిస్థితులు ఎదురైతే ఢిల్లీలో అన్ని ప్రైవేటు వాహనాలు, నిర్మాణాలు, రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

(The above story first appeared on LatestLY on Nov 15, 2021 12:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).