New Delhi, August 9: ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద 17 ఏళ్ల యువతిని గ్యాంగ్ రేప్ ( Minor girl raped ) చేశారు. తిలక్ బ్రిడ్జ్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని పొదల్లో యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని హర్‌దీప్ నగర్ , రాహుల్‌గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వాటర్ బాటిళ్లు అమ్ముతుంటారు.ఐపీసీ 376డీ కింద కేసును బుక్ చేశారు.ఆ ఇదర్నీ అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసు ఆఫీసర్ హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ అమ్మాయి తన ఫ్రెండ్ దీపక్‌తో కలిసి ఢిల్లీ స్టేషన్‌కి (New Delhi railway station) వచ్చింది. గుజరాత్ వెళ్లేందుకు రైలు ఎక్కాల్సి సమయంలో ఆ ఇద్దరి మధ్య గొడవ అయ్యింది. సెంట్రల్ ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్న సమయంలో అమ్మాయికి, దీపక్‌కు ఘర్షణ జరిగింది.గొడవ తరువాత దీపక్ ఆమెను స్టేషన్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు కామాందులు ఆమెను కలిశారు.
సోదరుడికి ఫోన్ కాల్ చేసేందుకు మొబైల్ ఇవ్వాలని ఆ అమ్మాయి వారిని వేడుకున్నది. రైలు దొరికేలా హెల్ప్ చేయాలని ఆ అమ్మాయి వాళ్లను అడిగింది. అయితే మరో స్టేషన్ వద్ద ట్రైన్ దొరకుతుందని చెప్పిన ఇద్దరూ ఆ అమ్మాయిని తిలక్ బ్రిడ్జ్ వద్ద ఉన్న పొదల్లోకి తీసుకువెళ్లి రేప్ చేశారు.అనంతరం పరార్ అయ్యారు. బాధితురాలు ఎలాగోలా పొదల్లో నుంచి బయటకు వచ్చి స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.