Road Accident In Shirdi: షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ భక్తుల కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

మహారాష్ట్రలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు.

Road Accident In Shirdi: షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ భక్తుల కన్నుమూత.. అసలేం జరిగిందంటే?
Representative Image (Photo Credit- PTI)

Shirdi, Jan 17: మహారాష్ట్రలోని (Maharastra) ప్రఖ్యాత పుణ్యక్షేత్రం షిర్డీలో (Shirdi) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కొండగడప గ్రామానికి చెందిన కొందరు రెండు రోజుల క్రితం షిర్డీ సాయిబాబాను దర్శించుకోవడం కోసం అక్కడికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా, వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

అఫ్జల్‌గంజ్‌లో గన్‌ ఫైరింగ్, పోలీసుల పైకి 3 రౌండ్ల కాల్పులు జరిపిన ఏటీఎం దొంగలు

ఒకే కుటుంబానికి చెందినవాళ్లు..

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను ప్రేమలత (59), ప్రసన్న లక్ష్మి (45) అక్షిత (20), వైద్విక్ నందన్ (6నెలలు)గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇలా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదం కారణంగా దుర్మరణం చెందడంతో కొండగడప గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం, బాలికను నమ్మించి మాయమాటలు చెప్పి అత్యాచారం, నిందితుడిపై పోక్సో కేసు 

(The above story first appeared on LatestLY on Jan 17, 2025 08:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).