India-China Face Off: సరిహద్దు వద్ద దూకుడు పెంచిన భారత్, వ్యూహాత్మకంగా పలు కీలక స్థావరాలు స్వాధీనం, చైనా దళాలకు ఎదురుగా తరలుతోన్న భారత బలగాలు

భారతదేశం తన స్థావరాలను బలోపేతం చేసుకోవడంతో పాటు దక్షిణ ఒడ్డున వ్యూహాత్మక పర్వత ఎత్తులను స్వాధీనం చేసుకోవడంతో, ప్రస్తుతం ఇరు దేశాల సైనికులు కేవలం 300-500 మీటర్ల దూరంలో ఉన్నారని, దీంతో సరిహద్దు వద్ద తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది.....

India-China Face Off: సరిహద్దు వద్ద దూకుడు పెంచిన భారత్, వ్యూహాత్మకంగా పలు కీలక స్థావరాలు స్వాధీనం, చైనా దళాలకు ఎదురుగా తరలుతోన్న భారత బలగాలు
India - China Border Tension | Photo: Twitter

New Delhi/Beijing, September 3: సరిహద్దు ప్రాంతాల గుండా భారత భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చేందుకు దుస్సాహాసం చేస్తున్న చైనాకు భారత్ కూడా అదే శైలిలో ధీటుగా సమాధానం ఇస్తోంది. లడఖ్‌లోని పంగోంగ్ సరస్సు యొక్క ఉత్తర ఒడ్డుతో పాటు చైనాతో సరిహద్దులను పంచుకునే ప్రతీచోటా, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అదనపు బలగాలు మోహరించాయి. చైనాకు గట్టి షాక్ ఇస్తూ ఇప్పటికే భారత్ పలు కీలకమైన స్థావరాలను స్వాధీనం చేసుకుంది.

దీంతో ఆగ్రహంతో ఉన్న చైనా సరిహద్దు వద్ద పాంగోంగ్ త్సో-చుషుల్ ప్రాంతాల నడుమ 'ఫింగర్స్' గా పిలువబడే పర్వత ఎత్తులను ఖాళీ చేయించటానికి భారత్ పై అన్ని రకాల ఒత్తిడి తీసుకువచ్చింది. చైనా సైనికుల చొరబాట్లను అడ్డుకునేందుకు భారత సైన్యం కొద్ది రోజుల కిందటే 'ఫింగర్ -4' నుండి 'ఫింగర్ -8' కీలకమైన స్థావరాలను స్వాధీనం చేసుకుంది. ఈ స్థావరాల నుంచి చైనా సైన్యం కదలికలను ఖచ్చితంగా పసిగట్టవచ్చు. మరోవైపు నుంచి కూడా చైనా సైనికులు ఏ రకంగా దూకుడుగా వ్యవహరించే అవకాశం ఇవ్వకుండా

పాంగోంగ్ సరస్సు యొక్క ఉత్తర ఒడ్డున ఉన్న 'ఫింగర్ -2 మరియు 3' పర్వత ఎత్తులను సైతం భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.

భారతదేశం తన స్థావరాలను బలోపేతం చేసుకోవడంతో పాటు దక్షిణ ఒడ్డున వ్యూహాత్మక పర్వత ఎత్తులను స్వాధీనం చేసుకోవడంతో, ప్రస్తుతం ఇరు దేశాల సైనికులు కేవలం 300-500 మీటర్ల దూరంలో ఉన్నారని, దీంతో సరిహద్దు వద్ద తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తలు తీవ్రమవుతున్న నేపథ్యంలో 3,400 కిలోమీటర్ల పొడవైన భారత్- చైనా వాస్తవాధీన రేఖ వెంబడి అప్రమత్తంగా ఉండాలని భారత బలగాలకు ఇప్పటికే సమాచారం అందింది.

నిజానికి సైన్యం స్వాధీనం చేసుకున్న స్థావరాలన్నీ భారత భూభాగంలోకే వస్తాయి, అయితే చైనా సైనికులు సరిహద్దు గుండా అనేక పాయింట్ల వద్ద చొరబడుతూ భారత సైన్యాన్ని రెచ్చగొడుతూ వచ్చింది. గత మే నెల నుండి ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. 45 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంతగా మొదటిసారి ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడ్డారు. జూన్ 15న జరిగిన ఘటనతో ఇరు దేశాల సంబంధాలు ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నాయి, సుమారు 20 మంది సైనికుల మరణాలను భారతదేశం నివేదించగా, చైనా మాత్రం తనకు జరిగిన ప్రాణనష్టాన్ని ఇప్పటికీ స్పష్టంగా వెల్లడించలేదు.

(The above story first appeared on LatestLY on Sep 03, 2020 08:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).