Death Threat To PM Modi: అర్థరాత్రి పుల్లుగా తాగి ప్రధాని మోదీని చంపేస్తామంటూ పోలీసులకు బెదిరింపు కాల్, సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అగంతుకుడిని గుర్తించిన పోలీసులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానంటూ ఓ ఆగంతుకుడు కాల్ చేయడంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు

Death Threat To PM Modi: అర్థరాత్రి పుల్లుగా తాగి ప్రధాని మోదీని చంపేస్తామంటూ పోలీసులకు బెదిరింపు కాల్, సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అగంతుకుడిని గుర్తించిన పోలీసులు
Representational Image (File Photo)

Lucknow, July 11: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానంటూ ఓ ఆగంతుకుడు కాల్ చేయడంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సెల్ లొకేషన్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన గోరఖ్ పూర్ లో సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది.

నిందితుడు రాత్రి మద్యం మత్తులో బెదిరింపులకు పాల్పడ్డట్లు ప్రాథమిక విచారణలో తేలిందని యూపీ పోలీసులు తెలిపారు. సోమవారం యూపీ పోలీసుల హెల్ప్ లైన్ 112 కు ఓ వ్యక్తి ఫోన్ చేసి ప్రధాని, సీఎంలను చంపేస్తానని బెదిరించాడు. తన పేరు అరుణ్ కుమార్ అని, గోరఖ్ పూర్ లోని భుజౌలి కాలనీ నివాసినని చెప్పాడు.

వివాహం చట్టబద్దం కాకపోయినా రెండవ భార్యకు నెలవారీ భరణం చెల్లించాల్సిందే, సెకండ్ వైఫ్ మెయింటెనెన్స్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దీంతో అలర్ట్ అయిన పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించారు. గోరఖ్ పూర్ జిల్లాలోని దేవ్రద్ గ్రామం నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించారు. గ్రామానికి వెళ్లి విచారించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా.. మద్యం మత్తులో ఫోన్ చేసినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Jul 11, 2023 10:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).