Gujarat: కోడలిపై కన్నేసిన మామ, రూంలోకి లాక్కెళ్లి రాత్రంతా అత్యాచారం, నీమొగుడు లేని లోటు తీరుస్తానని, వినకుంటే కొడుకుని చంపేస్తానని బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఈ ఏడాది ఫిబ్రవరి 14 ఏప్రిల్ 14 మధ్య నిందితుడు తనపై నాలుగు సార్లు లైంగిక దాడికి ( repeatedly 'rapes' daughter-in-law) పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది.
Surat, April 18: గుజరాత్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలిని బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యాపారి (Jamnagar businessmen) ఉదంతం వెల్లడైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 ఏప్రిల్ 14 మధ్య నిందితుడు తనపై నాలుగు సార్లు లైంగిక దాడికి ( repeatedly 'rapes' daughter-in-law) పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలికి 2002లో నిందితుడి కుమారుడితో వివాహం కాగా, వారికి 18 ఏండ్ల కుమారుడు ఉన్నాడు.
అయితే భార్యాభర్తల మధ్య కొన్నేండ్ల తర్వాత తరచూ ఘర్షణలు జరుగుతుండటంతో మహిళ కుమారుడితో కలిసి సూరత్‌లోని తన పుట్టింట్లో ఉంటోంది. కాగా ప్రతినెలా నిర్వహణ ఖర్చుల కింద రూ 6000 చెల్లించాలని నిందితుడి కుమారుడిని కోర్టు ఆదేశించింది. 2017లో బాధితురాలి తల్లి చనిపోవడంతో నిందితుడైన మామ తన కుటుంబ సభ్యులతో కలిసి సూరత్ వెళ్లాడు. ఈ క్రమంలో మహిళకు ఆమె భర్తకు మధ్య రాజీ కుదర‌్చడంతో బాధితురాలు తిరిగి మెట్టినింటికి చేరింది.
అయితే తిరిగి వచ్చిన కొద్ది రోజులకే భార్యభర్తల మధ్య గొడవలు మొదలవయ్యాయి. దీంతో మహిళ భర్త..అతని భార్యను దూరం పెట్టిన భర్త అన్న, వదినల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో కోడలిపై కన్నేసిన మామ ఈ ఏడాది ఫిబ్రవరి 14న రాత్రి సమయంలో ట్యాంక్‌లో నీళ్లు లేవని చెప్పడంతో చూసేందుకు వచ్చిన కోడలిని వెనకనుంచి పట్టుకుని తన రూంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. రేప్ అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే నీ కుమారుడిని చంపేస్తానని (threatens to kill her son on matter disclosure) బెదిరించాడు. భర్త దూరంగా ఉన్నాడనే లోటు లేకుండా చూస్తానంటూ మనవడు ఇంట్లో లేని సమయంలో కోడలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాజాగా మామ అరాచకాలపై కోడలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
(The above story first appeared on LatestLY on Apr 18, 2022 04:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

