Gurugram Spa Raid: వీడియోలు ఇవిగో.. స్పా సెంటర్ లోపలకు వెళ్లిన పోలీసులు.. అక్కడ న్యూడ్ సీన్లు చూసి ఒక్కసారిగా షాక్.. గురుగ్రామ్‌లో 18 స్పా కేంద్రాలపై ఒకేసారి దాడులు..

మసాజ్ సెంటర్ల మాటున సాగుతున్న వ్యభిచార దందాలపై హరియాణా పోలీసులు, రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ మాల్‌లో నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై అధికారులు అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా మెరుపు దాడులు నిర్వహించారు

Gurugram Spa Raid: వీడియోలు ఇవిగో.. స్పా సెంటర్ లోపలకు వెళ్లిన పోలీసులు.. అక్కడ న్యూడ్ సీన్లు చూసి ఒక్కసారిగా షాక్..  గురుగ్రామ్‌లో 18 స్పా కేంద్రాలపై ఒకేసారి దాడులు..
Gurugram Spa Raid.jpg

Gurugram Spa Raid: మసాజ్ సెంటర్ల మాటున సాగుతున్న వ్యభిచార దందాలపై హరియాణా పోలీసులు, రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ మాల్‌లో నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై అధికారులు అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా మెరుపు దాడులు నిర్వహించారు. ఒకటి కాదు.. ఏకంగా 18 స్పా కేంద్రాలపై ఒకేసారి దాడులు చేసి, అక్కడ సాగుతున్న చీకటి వ్యాపారాన్ని అధికారులు బట్టబయలు చేశారు.

సెక్టార్-90లో ఉన్న 'సఫైర్ 90' మాల్ వేదికగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా, డ్యూటీ మేజిస్ట్రేట్ సమక్షంలో సుమారు 100 మంది పోలీస్ సిబ్బందితో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. తెల్లవారుజామున 3 గంటల వరకు అంటే దాదాపు ఐదు గంటల పాటు ఈ శోధనలు నిరంతరాయంగా కొనసాగాయి.

ఉపాధ్యాయుడితో స్టూటెంట్ రాసలీలలు వీడియో వైరల్.. ఇది నిజం కాదని MMS స్కాండల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హచ్చరిక..

పోలీసుల రాకను గమనించిన స్పా సెంటర్ల నిర్వాహకులు లోపలి నుంచి తలుపులు వేసుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరికొన్ని కేంద్రాలకు బయట నుంచి తాళాలు వేసి లోపల కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వెల్డింగ్ మెషీన్లు తెప్పించి, తలుపుల తాళాలను బద్దలు కొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించారు.

Gurugram Spa Raid Videos: 

స్పా సెంటర్ల ప్రకటన బోర్డులు, గోడల వెనుక రహస్య గదులను నిర్మించి ఈ వ్యభిచార దందాను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లోపల తనిఖీలు చేయగా సెక్స్ టాయ్స్, అభ్యంతరకర వస్తువులు మరియు భారీగా విదేశీ మద్యం లభించాయి. తనిఖీల సమయంలో 30 మంది మహిళలు, 20 మంది పురుషులు అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుబడ్డారు. కెమెరాల్లో దృశ్యాలు రికార్డు చేయవద్దంటూ కొందరు వ్యక్తులు అధికారులను వేడుకోగా, నిర్వాహకులు ఆధారాలను డస్ట్ బిన్లలో పడేసి దాక్కునేందుకు ప్రయత్నించారు.

ఈ సోదాల్లో భాగంగా స్పా కేంద్రాల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ రికార్డర్లు, నగదు మరియు పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారందరినీ స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంత పెద్ద మాల్‌లోనే ఇన్ని స్పా సెంటర్లలో యథేచ్ఛగా ఈ కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి, దీని వెనుక ఎవరైనా రాజకీయ లేదా పోలీసు ఉన్నతాధికారుల హస్తం ఉందా అనే కోణంలో గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 19, 2026 01:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).