Human Sacrifice in Kolkata: కలకత్తాలో దారుణం, భార్య గర్భస్రావం పోకూడదని పొరిగింటి బాలికను నరబలి ఇచ్చిన కసాయి

కోల్‌కతాలో దారుణం చోటు చేసుకుంది. భార్యకు మరోసారి గర్భస్రావం కాకుండా ఉండేందుకు మంత్రగాడి సలహాతో పొరిగింటిలో ఉన్న బాలికను నరబలి ఇచ్చాడు. బీహార్‌కు చెందిన అలోక్ కుమార్ భార్యకు మూడుసార్లు గర్భస్రావమైంది.ఆమె మళ్లీ గర్భం దాల్చింది.

Human Sacrifice in Kolkata: కలకత్తాలో దారుణం, భార్య గర్భస్రావం పోకూడదని పొరిగింటి బాలికను నరబలి ఇచ్చిన కసాయి
(Representative Photo | Photo Credit: Pixabay)

Tiljala, Mar 27: కోల్‌కతాలో దారుణం చోటు చేసుకుంది. భార్యకు మరోసారి గర్భస్రావం కాకుండా ఉండేందుకు మంత్రగాడి సలహాతో పొరిగింటిలో ఉన్న బాలికను నరబలి ఇచ్చాడు. బీహార్‌కు చెందిన అలోక్ కుమార్ భార్యకు మూడుసార్లు గర్భస్రావమైంది.ఆమె మళ్లీ గర్భం దాల్చింది.

భార్యకు ఈసారి గర్భస్రావం కాకుండా ఉండేందుకు అలోక్‌ కుమార్‌ ఒక మంత్రగాడిని సంప్రదించాడు. ఒక చిన్నారిని నరబలి ఇస్తే ఆమె గర్భం నిలుస్తుందని ఆ మంత్రగాడు చెప్పాడు. దీంతో అలోక్‌ కుమార్‌, ఆదివారం సాయంత్రం పొరుగున ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్‌ చేశాడు. నరబలి పేరుతో దారుణంగా హత్య చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అలోక్ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

యూపీలో దారుణం, కొడుకు ఆరోగ్యం కోసం ఏడేళ్ల బాలుడు నరబలి, మంత్రగాడి మాటలు నమ్మి చిన్నారిని దారుణంగా గొంతు చేసి హత్య చేసిన కసాయి

తన భార్యకు మరోసారి గర్భస్రావం కాకుండా ఉండేందుకు మంత్రగాడి సలహా మేరకు బాలికను నర బలి ఇచ్చినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ బాలికపై లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది కూడా తెలుసుకుంటామని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

(The above story first appeared on LatestLY on Mar 27, 2023 07:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).