Hyderabad Horror: చందానగర్‌లో దారుణం, మర్మాంగాలు కోసి ఓ వ్యక్తి దారుణ హత్య, రూంలో తాగి పడేసిన మందుబాటిళ్లు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ పాలవెల్లి తెలిపిన ప్రకారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకామనిపాడు గ్రామానికి చెందిన తన్నీరు మాలాద్రి (36) భార్య మాధవితో కలిసి ఆరేళ్లుగా శేరిలింగంపల్లి తారానగర్‌లో ఉంటున్నాడు.

Hyderabad Horror: చందానగర్‌లో దారుణం, మర్మాంగాలు కోసి ఓ వ్యక్తి దారుణ హత్య, రూంలో తాగి పడేసిన మందుబాటిళ్లు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hyderabad Horror: Andhra Pradesh Man Bleeds to Death After Attack on Genitals

Hyd, Oct 10: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ పాలవెల్లి తెలిపిన ప్రకారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకామనిపాడు గ్రామానికి చెందిన తన్నీరు మాలాద్రి (36) భార్య మాధవితో కలిసి ఆరేళ్లుగా శేరిలింగంపల్లి తారానగర్‌లో ఉంటున్నాడు. సెంట్రింగ్‌ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మాలాద్రి ఇంటి పక్కనే సోదరి అరుణ కూడా నివాసముంటున్నారు. కాగా అతని భార్య మాధవి సెప్టెంబర్‌ 30న తన సొంత గ్రామంలో బంధువుల పెళ్లి ఉండడంతో పిల్లలతో కలిసి ఊరెళ్లింది.

వీడియో ఇదిగో, హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య, డ్రైవర్‌ని కత్తులతో వెంటాడి నరికిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి

మంగళవారం మాలాద్రి ఉదయం ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం 6 గంటలకు అతని సోదరి అరుణ పిలిస్తే పలకలేదు. నిద్రపోయి ఉంటాడని ఆమె వెళ్లిపోయింది. 6.30 గంటలకు ఫోన్‌ చేయగా తీయకపోవడంతో వారు మళ్లీ ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడని, మర్మాంగాలు కోసి ఉన్నాయని ధృవీకరించారు. దీంతో అర్ధరాత్రి చందానగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ పాలవెల్లి, క్లూస్‌ టీం సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.

కాగా ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు కూడా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. తాగిన మత్తులో పరస్పర వివాదం జరిగి హత్య జరిగిందా, లేదా ఏమైనా ఇల్లీగల్ ఎఫైర్ అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Oct 10, 2024 01:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).