Hyderabad Horror: గచ్చిబౌలిలో అర్థరాత్రి రెచ్చిపోయిన కామాంధులు, డ్యూటీ నుంచి ఇంటికి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆటోలోకి లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు
Hyd, Oct 15: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు.ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలికి ఆటోలో యువతి వెళ్తుండగా ఆ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఆమెపై ఆటో డ్రైవర్ తో పాటు, మరో యువకుడు ఆటోలోనే అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను మసీద్ బండ వద్దే వదిలేసి పోయారు. తనపై జరిగిన అఘాయిత్యంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
(The above story first appeared on LatestLY on Oct 15, 2024 11:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

