India's COVID Update: భారత్‌లో కొత్తగా 40,120 కోవిడ్ కేసులు, 585 మరణాలు నమోదు మరియు 42,295 మంది రికవరీ; గడిచిన ఒక్కరోజులో కేరళ రాష్ట్రం నుంచే 21 వేల కొత్త కేసులు

కేరళలో పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు, గడిచిన ఒక్కరోజులో కేరళలో 21,445 కేసులు 160 మరణాలు నమోదయ్యాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలో 6,388 కేసులు మరియు 208 కేసులు నమోదయ్యాయి....

India's COVID Update: భారత్‌లో కొత్తగా 40,120 కోవిడ్ కేసులు, 585 మరణాలు నమోదు మరియు 42,295 మంది రికవరీ; గడిచిన ఒక్కరోజులో కేరళ రాష్ట్రం నుంచే 21 వేల కొత్త కేసులు
COVID19 Outbreak in India | Photo: ANI

New Delhi, August 13: భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా ఇంకా కొనసాగుతోంది, రోజూవారీ కోవిడ్ కేసుల్లో తగ్గుదల చాలా నెమ్మదిగా సాగుతోంది. జూలై చివరి వారం నుంచి ఆగష్టు రెండో వారం వరకు రోజూవారీ కోవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆగస్టు 11న బుధవారం 38 వేల కేసులు రాగా గురువారం 41 వేలు దాటాయి, నేడు శుక్రవారం కూడా నిన్నటి కంటే సుమారు వెయ్యి కేసులు తగ్గినప్పటికీ 40 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. కేరళలో పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు, గడిచిన ఒక్కరోజులో కేరళలో  21,445 కేసులు 160 మరణాలు నమోదయ్యాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలో 6,388 కేసులు  మరియు 208 కేసులు నమోదయ్యాయి.

ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 40,120 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,17,826 కు చేరింది. నిన్న ఒక్కరోజే 585 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,30,254 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,295 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,13,02,345 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,85,227 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.46% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.20 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఆగష్టు 12 నాటికి దేశవ్యాప్తంగా 48,94,70,779 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,70,495 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 57,31,574 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 52.95 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 52,95,82,956 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 41.16 కోట్లు ఉండగా, 11.79 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.

(The above story first appeared on LatestLY on Aug 13, 2021 10:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).