COVID19 in India: భారత్‌లో 2,36,657 దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 9.887 పాజిటివ్ కేసులు నమోదు, 6,642 కు పెరిగిన కరోనా మరణాలు
నిన్న దేశవ్యాప్తంగా 4,610 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,14,072 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,15,942 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....
New Delhi, June 6: భారతదేశంలో కరోనా విలయం కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 2,36, 657 కు చేరింది. నిన్న ఒక్కరోజే 294 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 6642 కు పెరిగింది.
నిన్న దేశవ్యాప్తంగా 4,610 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,14,072 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,15,942 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రాల వారీగా ప్రస్తుతం ఉన్న ఆక్టివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి
| S. No. | Name of State / UT | Active Cases* | Cured/Discharged/Migrated* | Deaths** | Total Confirmed cases* |
| 1 | Andaman and Nicobar Islands | 0 | 33 | 0 | 33 |
| 2 | Andhra Pradesh | 1654 | 2576 | 73 | 4303 |
| 3 | Arunachal Pradesh | 44 | 1 | 0 | 45 |
| 4 | Assam | 1651 | 498 | 4 | 2153 |
| 5 | Bihar | 2342 | 2225 | 29 | 4596 |
| 6 | Chandigarh | 77 | 222 | 5 | 304 |
| 7 | Chhattisgarh | 633 | 244 | 2 | 879 |
| 8 | Dadar Nagar Haveli | 13 | 1 | 0 | 14 |
| 9 | Delhi | 15311 | 10315 | 708 | 26334 |
| 10 | Goa | 131 | 65 | 0 | 196 |
| 11 | Gujarat | 4901 | 13003 | 1190 | 19094 |
| 12 | Haryana | 1439 | 2134 | 24 | 3597 |
| 13 | Himachal Pradesh | 199 | 189 | 5 | 393 |
| 14 | Jammu and Kashmir | 2202 | 1086 | 36 | 3324 |
| 15 | Jharkhand | 464 | 410 | 7 | 881 |
| 16 | Karnataka | 3090 | 1688 | 57 | 4835 |
| 17 | Kerala | 973 | 712 | 14 | 1699 |
| 18 | Ladakh | 48 | 48 | 1 | 97 |
| 19 | Madhya Pradesh | 2734 | 5878 | 384 | 8996 |
| 20 | Maharashtra | 42224 | 35156 | 2849 | 80229 |
| 21 | Manipur | 91 | 41 | 0 | 132 |
| 22 | Meghalaya | 19 | 13 | 1 | 33 |
| 23 | Mizoram | 21 | 1 | 0 | 22 |
| 24 | Nagaland | 94 | 0 | 0 | 94 |
| 25 | Odisha | 996 | 1604 | 8 | 2608 |
| 26 | Puducherry | 63 | 36 | 0 | 99 |
| 27 | Punjab | 344 | 2069 | 48 | 2461 |
| 28 | Rajasthan | 2507 | 7359 | 218 | 10084 |
| 29 | Sikkim | 3 | 0 | 0 | 3 |
| 30 | Tamil Nadu | 12700 | 15762 | 232 | 28694 |
| 31 | Telengana | 1550 | 1627 | 113 | 3290 |
| 32 | Tripura | 519 | 173 | 0 | 692 |
| 33 | Uttarakhand | 860 | 344 | 11 | 1215 |
| 34 | Uttar Pradesh | 3828 | 5648 | 257 | 9733 |
| 35 | West Bengal | 4025 | 2912 | 366 | 7303 |
| Cases being reassigned to states | 8192 | 8192 | |||
| Total | 115942 | 114073 | 6642 | 236657 |
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తి భయంకరంగా ఉంది. ఇక్కడ కోవిడ్ మొత్తం బాధితుల సంఖ్య ఇప్పటికే 80 వేలు దాటింది. శుక్రవారం నాటికి మహారాష్ట్రలో పాజిటివ్ గా నిర్ధారింపబడిన కేసుల సంఖ్య 80,229 కు చేరుకుంది. శుక్రవారం ఒకే రోజులోనే 139 మంది కోవిడ్ బాధితులు మరణించగా, కొత్తగా మరో 2,436 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర కరోనా మరణాల సంఖ్య శనివారం ఉదయం నాటికి 2,849 పెరగగా, ప్రస్తుతం మొత్తం కేసులలో 42,224 ఆక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా, కరోనావైరస్ సంఖ్య 6.7 మిలియన్లకు పెరిగింది, మరణాల సంఖ్య 394,000 కు చేరుకుంది, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం. మొత్తం కేసుల సంఖ్య 6,731,824 కాగా, మరణాల సంఖ్య 394,787 కు పెరిగిందని నివేదిక తెలిపింది. ఇక కోవిడ్-19 కేసుల్లో అధికార గణాంకాల ప్రకారం ప్రపంచంలో మొత్తం నమోదయిన కేసుల్లో భారత్ ఆరో స్థానానికి ఎగబాకింది.
(The above story first appeared on LatestLY on Jun 06, 2020 09:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

