Covid in India: దేశంలో 24 గంటల్లో 4,435 కొత్త కేసులు నమోదు, రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో ఆందోళన, ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Health Ministry Of India) వెల్లడించిన వివరాల ప్రకారం..గత 24 గంటల్లో 1,31,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి.163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబర్ 25న 4,777 కేసులు వెలుగు చూశాయి.
New Delhi, April 5: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో నాలుగు వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Health Ministry Of India) వెల్లడించిన వివరాల ప్రకారం..గత 24 గంటల్లో 1,31,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి.163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబర్ 25న 4,777 కేసులు వెలుగు చూశాయి.
తాజా కేసులతో దేశంలో కొవిడ్ (Covid-19) బారిన పడిన వారి సంఖ్య 44,733,719కి చేరింది. ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్ (Active Cases)గా ఉన్నాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళ, మహారాష్ట్రలో నలుగురు చొప్పున, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పుదుచ్ఛేరి, రాజస్థాన్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృతి చెందారు. దీంతో కొవిడ్ మరణాల సంఖ్య 5,30,916కి పెరిగింది.
ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.05 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Ministry Of India) అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 220.66 (220,66,16,373) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Apr 05, 2023 11:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

