Jharkhand Girl Raped: నోట్ బుక్ కోసం వెళ్తున్న ఆరో తరగతి బాలిక కిడ్నాప్, అత్యాచారం, అడ్రస్ కోసమని పిలిచి కారులో లాక్కెల్లిన దుండగులు, జార్ఖండ్ లో ఘటన, బాలిక పరిస్థితి విషమం
పన్నేండేళ్ల బాలిక స్కూల్‌కు వెళ్లిన తర్వాత ఒక నోట్‌బుక్ మరిచిపోవడంతో, తీసుకొచ్చేందుకు మధ్యలో ఇంటికి బయల్దేరింది. బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక అడ్రస్ కావాలని అడిగారు. బాలిక సమాధానం చెప్పేలోపే, కారులోకి లాక్కెళ్లారు. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
Ranchi, July 09: జార్ఖండ్‌లో (Jharkhand) దారుణం జరిగింది. స్కూల్ నుంచి వస్తున్న చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం (Rape) చేశారు దుండగులు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డమ్కా జిల్లా (Dumka గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన బుధవారం జరిగింది. పన్నేండేళ్ల బాలిక స్కూల్‌కు వెళ్లిన తర్వాత ఒక నోట్‌బుక్ మరిచిపోవడంతో, తీసుకొచ్చేందుకు మధ్యలో ఇంటికి బయల్దేరింది. బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక అడ్రస్ కావాలని అడిగారు. బాలిక సమాధానం చెప్పేలోపే, కారులోకి లాక్కెళ్లారు. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు దగ్గర్లోని గొడ్డా పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలిపెట్టారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులకు వివరించింది. వారు డమ్కా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం బాలికను ఫులో జానో ముర్ము మెడికల్ కాలేజ్‌కు వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం తరలించారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి నిందితులను ఇంకా గుర్తించలేదు. విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు.
(The above story first appeared on LatestLY on Jul 09, 2022 09:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

