Karnataka Horror: పెళ్లికి ఒప్పుకోలేదని నడిరోడ్డు మీద లవర్‌ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు, అనంతరం విషం తాగి ఆత్మహత్యాయత్నం, మృతి చెందిన ప్రియురాలు
పెండ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు తన ప్రియురాలిని నడిరోడ్డు మీద అత్యంత దారుణంగా పొడిచి చంపాడు.కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సుల్తానా అనే యువతి, చాంద్ పీర్ అలియాస్ సాదత్ అనే యువకుడు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
Bengaluru, Dec 22: పెండ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు తన ప్రియురాలిని నడిరోడ్డు మీద అత్యంత దారుణంగా పొడిచి చంపాడు.కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సుల్తానా అనే యువతి, చాంద్ పీర్ అలియాస్ సాదత్ అనే యువకుడు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, చాంద్ పీర్ పెండ్లి ప్రస్తావన తీసుకురాగా సుల్తానా అందుకు నిరాకరించింది. ఇటీవల సుల్తానాకు మరో యువకుడితో పెండ్లి నిశ్చయం చేశారు.
విషయం తెలుసుకున్న చాంద్ పీర్ మాట్లాడుకుందాం రమ్మని యువతిని బయటికి పిలిచాడు. స్కూటీపై వచ్చిన యువతితో మాట్లాడుతూనే వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం అక్కడి కొంత దూరం బైకుపై వెళ్లి విషం తాగి పడిపోయాడు.ఇది గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు సుల్తానా అప్పటికే మరణించినట్లు చెప్పారు. చాంద్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
(The above story first appeared on LatestLY on Dec 22, 2022 07:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

