Karnataka Shocker: భార్యపై అనుమానం, చిన్న పిల్లల గొంతు కోసి చంపిన కసాయి తండ్రి, కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి..

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. జిల్లాలోని దేవదుర్గ తాలూకా జక్లేరదొడ్డిలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిందితుడిని నింగప్పగా గుర్తించారు.

Karnataka Shocker: భార్యపై అనుమానం, చిన్న పిల్లల గొంతు కోసి చంపిన కసాయి తండ్రి, కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి..
Man Kills Son To Hide Affairrepresentational purpose only | (Photo Credits: PTI)

Raichuru, Feb 13: కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. జిల్లాలోని దేవదుర్గ తాలూకా జక్లేరదొడ్డిలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిందితుడిని నింగప్పగా గుర్తించారు.వివరాల్లోకెళితే... దేవదుర్గ తాలూకా జక్లేర్‌ దొడ్డిలో నింగప్ప (35), ప్రభావతి (30) దంపతులకు రాఘవేంద్ర (5), శివరాజ్‌ (3) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు కూలిపనులు చేసుకుంటూ జీవించేవారు. నింగప్ప భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో రోజూ ఆమెతో గొడవపడేవాడు.

కదిలే కారుపై ప్రమాదకర విన్యాసాలు, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు, బైక్‌పై ప్రమాదకర స్టంట్ చేసిన యువకుడు, వీడియోలు వైరల్

శనివారం రాత్రి కూడా అలాగే రగడపడ్డాడు. పిల్లలిద్దరూ అక్రమ సంబంధంతో పుట్టినవారేనని మండిపడ్డాడు. తరువాత కె.ఇరబగేరలో అవ్వ ఇంట్లో పిల్లలను జక్లేర్‌ దొడ్డి శివార్లకు బైక్‌ మీద తీసుకొని వచ్చాడు. వారిద్దరినీ గొంతు కోసి హత్య చేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం ఈ ఘోరం గురించి తెలిసి తల్లి, బంధువులు గుండెలవిసేలా విలపించారు. పసిబిడ్డలను పొట్టనబెట్టుకున్నాడని రోదించారు.

ఏడాది చిన్నారిపై మంత్రగాడు దారుణం, కుద్ర పూజలు పేరిట పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టిన భూత వైద్యుడు, చోద్యం చూస్తూ నిలబడ్డ తండ్రి

ఘటన జరిగిన రోజున నిందితుడు పిల్లలను అత్తమామల నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత వారి పిల్లలను హత్య చేసినట్లు సమాచారం. నింగప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టింది.తల్లి దేవదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నింగప్పను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.

(The above story first appeared on LatestLY on Feb 13, 2023 10:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).