KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు షాకిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Hyd, Oct 23: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు షాకిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
కేంద్రమంత్రిగా బాధ్యతయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం తనపై బురద చల్లాలన్న దురుద్దేశం, తమ పార్టీ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ నోటీసులో తెలిపారు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా, 9 ఏళ్లు రాష్ట్ర మంత్రి గా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేసిన తనను ఉద్దేశపూర్వకంగా బద్నాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారని చెప్పారు. గతంలోనూ బండి సంజయ్ తనపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే శక్తి లేకనే తన వ్యక్తిత్వంపై బురదచల్లే ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే ఇలాంటి ఆరోపణలు చేయటం ద్వారా ప్రజల్లో తన ప్రతిష్టను నాశనం చేయాలనే కుట్ర తప్ప వారి ఆరోపణల్లో నిజం లేదన్నారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ లీగల్ నోటీసులో హెచ్చరించారు. యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం...ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించడం సరికాదన్న ఈవో, ఇకపై చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలని హెచ్చరిక
ఈ నెల 19 వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా తీశారని చెప్పారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో తెలిపారు. కే ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయబడ్డాయని దీని కారణంగా ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకొని ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు.
(The above story first appeared on LatestLY on Oct 23, 2024 01:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

