Viral Video: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన, పెంపుడు కుక్క‌పై చిరుత దాడి, గొంతు ప‌ట్టుకొని లాక్కెళ్లింది, సీసీటీవీలో షాకింగ్ వీడియో..
(Photo Credit: social media)

ఓ చిరుత గాండ్రిపులు విన్న పెంపుడు కుక్క తీవ్ర గంద‌ర‌గోళానికి గురైంది. ఆ గాండ్రిపుల‌కు ధీటుగానే కుక్క కూడా అర‌వ‌సాగింది. అంత‌లోనే గేటు బ‌య‌ట ఉన్న చిరుత పులి.. ఒక్క‌సారిగా గ్రౌండ్‌లోకి దూకింది. అప్ర‌మ‌త్త‌మైన కుక్క ఆ పులి నుంచి త‌ప్పించుకునేందుకు య‌త్నించింది. కానీ ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. ఆ పెంపుడు కుక్క‌పై దాడి చేసిన చిరుత‌.. దాన్ని గొంతు ప‌ట్టుకొని.. గేటు వెలుప‌ల‌కు దూకింది. ఈ దృశ్యాల‌న్నీ ఆ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఈ ఘటన నాసిక్‌లోని ముంగ్‌సారే గ్రామంలో నివాస ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ వీడియోను ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.