Lucknow Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో.. అడ్డుగా ఉందని మహిళను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన మాజీ ప్రియుడు.. నిందితుడిని అరెస్ట్ చేసిన లక్నో పోలీసులు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనతో మాట్లాడేందుకు వచ్చిన ఒక మహిళను ఏమాత్రం పట్టించుకోకుండా, కారు బానెట్‌పైకి ఎక్కించి 25 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన గోమతీ నగర్ పరిధిలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ రోడ్డులో బుధవారం ఉదయం వెలుగు చూసింది.
Lucknow Viral Video: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనతో మాట్లాడేందుకు వచ్చిన ఒక మహిళను ఏమాత్రం పట్టించుకోకుండా, కారు బానెట్‌పైకి ఎక్కించి 25 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన గోమతీ నగర్ పరిధిలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ రోడ్డులో బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను సమీపంలో ఉన్న వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర కలకలం రేగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనామిక అనే మహిళ, గతంలో తనకు పరిచయస్తుడైన షానవాజ్ అనే వ్యక్తితో రోడ్డుపై వాగ్వాదానికి దిగింది. కారు దిగి మాట్లాడాలని ఆమె కోరినప్పటికీ అతను నిరాకరించడంతో, ఆమె కారు ముందు నిలబడి నిలదీసింది. అయినా షానవాజ్ కారును ముందుకు పోనివ్వడంతో అనామిక కారు బానెట్‌ను పట్టుకుని వేలాడింది.
Lucknow Viral Video:
"राजधानी लखनऊ के जनेश्वर मिश्र के पास युवती पर कार चढ़ाने की कोशिश.. वीडियो वायरल.."
कार के बोनट पर टंगी युवती जान बचाते हुए चीखती रही.. शाहनवाज नाम के युवक पर युवती को कुचलने की कोशिश का आरोप.. शाहनवाज और युवती आपस में परिचित बतए जा रहे हैं..
शाहनवाज पर हिंदू बनकर युवती को… pic.twitter.com/jDPBD3vm8f
— Vivek K. Tripathi (@meevkt) September 16, 2026
ఆ తర్వాత కారు ఆగడంతో ఆమె కారు ముందు అద్దాన్ని కొట్టి నిలదీసే ప్రయత్నం చేయగా, రెచ్చిపోయిన షానవాజ్ కారును వేగంగా ముందుకు తోలాడు. బానెట్‌పై వేలాడుతూ బాధితురాలు కాపాడాలంటూ ఏడుస్తున్నా పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్లడంతో, ఆ వేగానికి ఆమె పక్కకు పడిపోయింది. కారు టైరు ఆమె తలకి అతి సమీపం నుండి వెళ్లడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
గాయపడిన అనామిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు షానవాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు లక్నో ఈస్ట్ డీసీపీ దీక్షా శర్మ తెలిపారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వీరిద్దరూ గతంలో సహజీవనం చేశారని, వ్యక్తిగత విభేదాల వల్లే ఈ గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతుండగా, నిందితుడు మాత్రం తన వద్ద ఉన్న నగదును ఆమె తీసుకుందని ఆరోపిస్తున్నాడు. కేసు దర్యాప్తు జరిపి పూర్తి నిజానిజాలు బయటపెడతామని పోలీసులు వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Sep 17, 2026 12:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

